BREAKING
నేడు మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రమేష్ శెట్టి: బొమ్మన దశరథరామిరెడ్డి చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి..! గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి *ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం* పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న పిచేర్యాగడి గ్రామ సర్పంచ్ అమృత వీరారెడ్డి బెల్టు షాపుపై పోలీసుల దాడి సమర్ధవంతమైన నాయకులను గెలిపించాలి: మజ్జి సిరి సహస్ర 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్ష.. ఇరుముడితో శబరిమలకు పయనం పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సోదరులను రాజకీయంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు బీసీల రాజకీయ చైతన్యానికి ఎస్సీలుగా మా మద్దతు కాశపాగ ఇమ్మయ్య వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా ప్రతినిధులు బచ్చు ప్రభాకర్ నూతన గృహ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి.

పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

Select Suryaa Now
పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

 

• నాణ్యతా ప్రమాణాలతో పనులు.. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

• భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : పవిత్ర గోదావరి నదీ తీరంలో భవిష్యత్తులో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల పుష్కర ఘాట్ అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు. ఈ మేరకు గోదావరి నదీ తీరంలో కొనసాగుతున్న పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఘాట్ వద్ద ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను, ఇప్పటివరకు పూర్తయిన పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలు, తదుపరి చేపట్టాల్సిన నిర్మాణాల గురించి అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనులను కేవలం హడావుడిగా కాకుండా పటిష్టమైన ప్రణాళికతో, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో గోదావరి పుష్కరాల సందర్భంగా మంచిర్యాల పుష్కర ఘాట్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అనువైన వాతావరణం కల్పించడంతోపాటు ఘాట్ పరిసరాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

పుష్కర ఘాట్ అభివృద్ధి అనేది ఒక్క శాఖకు సంబంధించిన పని మాత్రమే కాదని, వివిధ శాఖల సమన్వయంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్ తదితర సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో ఇరిగేషన్ ఇ ఎన్ సీ  రమేష్, సి ఈ సి డి ఓ జహీర్, మంచిర్యాల ఎస్సీ సత్యనారాయణ, ఈఈ ప్రభాకర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, డిఈ, ఏఈ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.