BREAKING
సర్పంచ్ కోసం 41 మంది నామినేషన్లు నేడు మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రమేష్ శెట్టి: బొమ్మన దశరథరామిరెడ్డి చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి..! గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి *ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం* పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న పిచేర్యాగడి గ్రామ సర్పంచ్ అమృత వీరారెడ్డి బెల్టు షాపుపై పోలీసుల దాడి సమర్ధవంతమైన నాయకులను గెలిపించాలి: మజ్జి సిరి సహస్ర 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్ష.. ఇరుముడితో శబరిమలకు పయనం పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సోదరులను రాజకీయంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు బీసీల రాజకీయ చైతన్యానికి ఎస్సీలుగా మా మద్దతు కాశపాగ ఇమ్మయ్య వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా ప్రతినిధులు బచ్చు ప్రభాకర్ నూతన గృహ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు

సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రమేష్ శెట్టి: బొమ్మన దశరథరామిరెడ్డి

Select Suryaa Now
సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రమేష్ శెట్టి: బొమ్మన దశరథరామిరెడ్డి

వెల్దుర్తి మేజర్ న్యూస్. సేవా దృక్పథంతో పాటు ప్రజలకు మంచి చేయాలనే తపన కలిగిన వ్యక్తి తిరువీధి రమేష్ శెట్టి అని మాజీ ఎంపీపీ, గ్రామ పెద్ద బొమ్మన దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఏబీఎం చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. సర్పంచిగా పోటీ చేస్తున్న తిరువీధి రమేష్ శెట్టిని ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ ప్రాంతంతో తమకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని, గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. మంచి వ్యక్తులు పదవుల్లోకి వస్తేనే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.అనంతరం తిరువీధి రమేష్ శెట్టి మాట్లాడుతూ.. గ్రామ పెద్ద బొమ్మన దశరథరామిరెడ్డి సూచనల మేరకు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. పాస్టర్ శశికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు బొమ్మన శ్రీకర్ రెడ్డి, బొమ్మన శ్రీధర్ రెడ్డి, తిరువీధి సుధీంద్ర, చర్చి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.