BREAKING
సోమందేపల్లి పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతాం.. కూటమి సర్పంచ్ అభ్యర్థి సిసి హరి నామినేషన్ దాఖలు కోటి ఓట్లు.. 90 సీట్లే మా టార్గెట్ *కుందుర్పి సర్పంచ్ బరిలో తండ్రి,కొడుకులు* పొన్నూరు 9 వ వార్డు లో జనసేన అభ్యర్థి ఆకుల. పద్మావతి గడపగడప విస్తృత ప్రచారం వార్డుల లో సర్పంచ్ అభ్యర్థి వార్డు అభ్యర్థుల ప్రచారం సర్పంచ్ కోసం 41 మంది నామినేషన్లు నేడు మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రమేష్ శెట్టి: బొమ్మన దశరథరామిరెడ్డి చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి..! గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి *ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం* పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న పిచేర్యాగడి గ్రామ సర్పంచ్ అమృత వీరారెడ్డి బెల్టు షాపుపై పోలీసుల దాడి సమర్ధవంతమైన నాయకులను గెలిపించాలి: మజ్జి సిరి సహస్ర 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్ష.. ఇరుముడితో శబరిమలకు పయనం పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

సర్పంచ్ కోసం 41 మంది నామినేషన్లు

Select Suryaa Now
సర్పంచ్ కోసం 41 మంది నామినేషన్లు

 

 
గుంటూరు రూరల్, మేజర్ న్యూస్: 
 
గుంటూరు రూరల్ మండలంలో పంచాయితీ ఎన్నికల వేడి మొదలైంది. ఆదివారం మొత్తం తొమ్మిది పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం  41 మంది, మరొక 135 మంది వార్డు సభ్యులకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అత్యధి కంగా వెంగళాయపాలెంలో సర్పంచ్ 7, వార్డు నెంబర్లు 37 మంది నామినేషన్లు అందజేశారు. లాలుపురంలో సర్పంచ్ అభ్యర్థి 3, వార్డు సభ్యులు కోసం 11, ఓబుల నాయుడుపాలెం లో సర్పంచ్ అభ్యర్థి కోసం 7, వార్డు సభ్యులు 16, చల్లావారిపాలెం సర్పంచ్ కోసం 6, వార్డు నెంబర్ కోసం 21, గొర్ల వారి పాలెం లో సర్పంచ్ కోసం 4, వార్డ్ మెంబర్లుగా 11, దాసుపాలెంలో సర్పంచ్ 2, వార్డు మెంబర్లు గా 2, మల్లవరంలో సర్పంచ్ 4, వార్డులు 11; తోకవారిపాలెం లో సర్పంచ్ 5, వార్డు మెంబర్లు 16; తురకపాలెం లో సర్పంచ్ 2, వార్డు నెంబర్లు 10 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. 23వ తేదీ సోమవారంతో నామినేషన్ ప్రక్రియ ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. ఓబుల నాయుడుపాలెం సర్పంచ్ అభ్యర్థి చింతా సుబ్బారావు జనసేన కూటమి మద్దతుదారులతో నామినేషన్ కోసం భారీ ర్యాలీతో లాలుపురం లోని నామినేషన్ కేంద్రానికి తరలివచ్చారు. చల్లావారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన మన్నేడి నాగమణి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. పుట్టలమ్మ తల్లి దేవాలయం కమిటీ చైర్మన్ సుధా పిచ్చయ్య, టిడిపి నాయకులు గోపాలం సురేష్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
ఆళ్ల వీరభద్రరావు