సోమందేపల్లి పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతాం.. కూటమి సర్పంచ్ అభ్యర్థి సిసి హరి నామినేషన్ దాఖలు
శ్రీ సత్యసాయి జిల్లా లో సోమందేపల్లి మేజర్ పంచాయతీ పెద్ద పంచాయతీ... పంచాయతీని ప్రభుత్వ, ప్రజల సహాయ సహకారా లతో మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని పంచా యతీ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిసి హరి తెలిపారు. ఆదివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికా రులకు సమర్పించారు. అంతకుముందు తన మద్దతు దారులు,అనుచరులు, కూటమి నాయకులతో కలిసి భారీగా నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకోవడం జరిగింది. మేజర్ పంచాయతీ అయినా సోమందే పల్లి పంచాయతీ సమగ్ర అభివృద్ధికి, ప్రజలకు మౌలిక వసతుల కల్పన, అన్నీ వర్గాల పురోభివృద్ధికి కృషిచేసి అభివృద్ధికి దిక్సూచిగా.. మోడల్ పంచాయ తీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. పంచాయతీలో తాగునీరు, విద్యు త్తు, మురుగు కాలువలు, వీధి దీపాలు, మౌలిక వసతుల సమస్య లను పరిష్కారం చూపుతామన్నారు. అన్ని వర్గాల పురోభివృద్ధికి, ప్రజల అవసరాలు తీర్చడానికి కూటమి కృషి చేస్తుందని వివరిం చారు. ఈ కార్య క్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.