నవోదయ మోడల్ పరీక్షకు అపూర్వ ఆదరణ..
నరసన్నపేట నవంబర్ 22 మేజర్ న్యూస్:యూటీఎఫ్ నరసన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి మోడల్ నవోదయ ప్రవేశ పరీక్షకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 524 మంది విద్యార్థులు హాజరయ్యారు. సుమారు 12 మండలాల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు.
ఈ నెల 28వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తొలగించడం, పరీక్షను ఎలా రాయాలి, ఏ విధంగా సంసిద్ధం కావాలి, నవోదయ విద్యాలయంలో విద్యనభ్యసించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ఈ మోడల్ పరీక్ష నిర్వహించినట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామమూర్తి తెలిపారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించేందుకు ఇలాంటి పోటీ పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నరసన్నపేట మండల శాఖను జిల్లా శాఖ తరఫున అభినందించారు.
అనంతరం పరీక్షా ఫలితాలను ప్రకటించగా ప్రథమ మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు:
1. సనపల హన్యశ్రీ – 87.5 మార్కులు, ఎంపీపీఎస్ రామయ్యపేట, కోటబొమ్మలి మండలం.
2. హనుమంతు జోషిత – 86.5 మార్కులు, ఎంపీపీఎస్ నిమ్మడ బీసీ స్కూల్, కోటబొమ్మలి మండలం.
3. చల్ల షణ్ముఖ – 86.5 మార్కులు, ఎంపీపీఎస్ జమ్ము, నరసన్నపేట మండలం.
విజేతలకు యూటీఎఫ్ ప్రకటించిన ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు గిఫ్ట్స్, మెమెంటోలు, మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. మొదటి 15 మంది విద్యార్థులకు మెమెంటోలు, మెరిట్ సర్టిఫికెట్లు, మొదటి 30 మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఈ బహుమతుల ప్రదాన కార్యక్రమంలో నరసన్నపేట మండల విద్యాశాఖ అధికారులు యు. శాంతారావు, పి. దాలినాయుడు, యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోరాడ వైకుంఠరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామమూర్తి, మండల శాఖ అధ్యక్షులు నక్క అప్పయ్య, ప్రధాన కార్యదర్శి జగదీష్, సీనియర్ యూటీఎఫ్ నాయకులు ఎన్. అప్పలనాయుడు పాల్గొన్నారు.
అలాగే ఆర్. దమయంతి, ఏ.ఆర్.ఆర్. భూషణరావు, పి. తిరుమలరావు, కె. ఆదినారాయణ, పి. కృష్ణారావు, వి. మన్మధరావు, వెంకటేష్, సునీల్, గౌతమ్, మూల రమణ, చల్ల సింహాచలం, యు. రామారావు తదితర యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.