BREAKING
వేంపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థినిగా బైగారి భారతి నాయుడు నామినేషన్ : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు,కార్యకర్తలు అమెజాన్ కంపెనీకి భూముల అప్పగింతపై గ్రామస్తుల అభ్యంతరం కొండచిలువను చంపకుండా బంధించిన రైతు.. నర్సింహులు ధైర్యసాహసాలకు అభినందనలు రాచవేటివారిపల్లి టిడిపి అభ్యర్థినిగా అరుణ కుమారి నామినేషన్ : హాజరైన సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్ పదవే లక్ష్యం కాదు.. పల్లె అభివృద్ధే ధ్యేయమంటూ.. పది హామీలు అమలు చేస్తా .. వైసీపీ తరఫున సోమందేపల్లి సర్పంచ్ స్థానానికి డిసి అశోక్ నామినేషన్ 33వ వార్డులో దద్దరిల్లిన వైఎస్ఆర్‌సీపీ ప్రచార భారీ ర్యాలీ పొన్నీటిపాళ్యం సర్పంచ్ బరిలో తిరుమలశెట్టి లావణ్య : నామినేషన్ దాఖలు చేసిన మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి కోడలు నవోదయ మోడల్ పరీక్షకు అపూర్వ ఆదరణ.. సోమందేపల్లి బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎస్ఆర్ పార్థసారథి రెడ్డి సోమందేపల్లి పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతాం.. కూటమి సర్పంచ్ అభ్యర్థి సిసి హరి నామినేషన్ దాఖలు కోటి ఓట్లు.. 90 సీట్లే మా టార్గెట్ *కుందుర్పి సర్పంచ్ బరిలో తండ్రి,కొడుకులు* పొన్నూరు 9 వ వార్డు లో జనసేన అభ్యర్థి ఆకుల. పద్మావతి గడపగడప విస్తృత ప్రచారం వార్డుల లో సర్పంచ్ అభ్యర్థి వార్డు అభ్యర్థుల ప్రచారం సర్పంచ్ కోసం 41 మంది నామినేషన్లు

రాచవేటివారిపల్లి టిడిపి అభ్యర్థినిగా అరుణ కుమారి నామినేషన్ : హాజరైన సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్

Select Suryaa Now
రాచవేటివారిపల్లి టిడిపి అభ్యర్థినిగా అరుణ కుమారి నామినేషన్ : హాజరైన సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్

 

నిమ్మనపల్లి,మేజర్ న్యూస్ : మదనపల్లి నియోజకవర్గం,నిమ్మనపల్లి మండలం,రాచవేటివారిపల్లిగ్రామపంచాయతీకి కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిని అరుణకుమారి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.కూటమి శ్రేణులతో కలిసి పెద్దఎత్తున ర్యాలీ బయలుదేరి రాచవేటివారిపల్లి కస్పాలో ఈశ్వరుని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అక్కడి నుండి రెడ్డివారిపల్లికి చేరుకొని గ్రామ సచివాలయంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ కార్యక్రమానికి హాజరైన టిడిపి సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిమ్మనపల్లి మండల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని,మౌలిక సదుపాయాల కల్పనకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేశారని కొనియాడారు.దీనిని దృష్టిలో ఉంచుకొని సర్పంచ్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మధు,గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున,మహిళా అధ్యక్షురాలు రుక్మిణమ్మ,వెంకటరమణ,కుమార్,కంచం రెడ్డెప్ప,శిరసాని వేణు,శ్రీనివాసులు,చెన్నం రాజశేఖర్ పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి