33వ వార్డులో దద్దరిల్లిన వైఎస్ఆర్‌సీపీ ప్రచార భారీ ర్యాలీ
పొన్నూరు మేజర్ న్యూస్ :--రాష్ట్ర వైఎస్సార్ సీపీ మాజీ ముఖ్యమంత్రి ఆశీస్సులతో పొన్నూరు నియోజకవర్గ అంబటి మురళీకృష్ణ దీవెనలతో పొన్నూరు పట్టణ 33వ వార్డు పెద్ద ఇటికంపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. పొన్నూరు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి షేక్ నాజర్ తల్లి షేక్ నాజిని ను 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దేవరపల్లి శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.పెద్ద ఇటికంపాడులోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్యాన్ జెండాలు చేతబట్టి, డప్పు వాయిద్యాలతో, నినాదాలతో వార్డు మొత్తం మార్మోగిపోయింది. దారి పొడవునా ప్రజలు పూలతో స్వాగతం పలికి, హారతులు ఇచ్చి అభ్యర్థులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా అభ్యర్థులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి, అంబటి మురళీకృష్ణ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మనవి చేశారు. వార్డు అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు . ఈ కార్యక్రమంలో పొన్నూరు పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్, వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్