BREAKING
విశాఖ–తిరువణ్ణామలై ప్రత్యేక రైలును రెగ్యులర్‌ చేయాలి ములకలచెరువు ఎంపీపీ దొరస్వామి నాయుడుకి టిడిపి నేతల సత్కారం : హాజరైన పచ్చిపాల రామకృష్ణ ఆచారి,పఠాన్ ఖాదర్ ఖాన్ వేంపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థినిగా బైగారి భారతి నాయుడు నామినేషన్ : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు,కార్యకర్తలు అమెజాన్ కంపెనీకి భూముల అప్పగింతపై గ్రామస్తుల అభ్యంతరం కొండచిలువను చంపకుండా బంధించిన రైతు.. నర్సింహులు ధైర్యసాహసాలకు అభినందనలు రాచవేటివారిపల్లి టిడిపి అభ్యర్థినిగా అరుణ కుమారి నామినేషన్ : హాజరైన సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్ పదవే లక్ష్యం కాదు.. పల్లె అభివృద్ధే ధ్యేయమంటూ.. పది హామీలు అమలు చేస్తా .. వైసీపీ తరఫున సోమందేపల్లి సర్పంచ్ స్థానానికి డిసి అశోక్ నామినేషన్ 33వ వార్డులో దద్దరిల్లిన వైఎస్ఆర్‌సీపీ ప్రచార భారీ ర్యాలీ పొన్నీటిపాళ్యం సర్పంచ్ బరిలో తిరుమలశెట్టి లావణ్య : నామినేషన్ దాఖలు చేసిన మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి కోడలు నవోదయ మోడల్ పరీక్షకు అపూర్వ ఆదరణ.. సోమందేపల్లి బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎస్ఆర్ పార్థసారథి రెడ్డి సోమందేపల్లి పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతాం.. కూటమి సర్పంచ్ అభ్యర్థి సిసి హరి నామినేషన్ దాఖలు కోటి ఓట్లు.. 90 సీట్లే మా టార్గెట్ *కుందుర్పి సర్పంచ్ బరిలో తండ్రి,కొడుకులు* పొన్నూరు 9 వ వార్డు లో జనసేన అభ్యర్థి ఆకుల. పద్మావతి గడపగడప విస్తృత ప్రచారం

అమెజాన్ కంపెనీకి భూముల అప్పగింతపై గ్రామస్తుల అభ్యంతరం

Select Suryaa Now
అమెజాన్ కంపెనీకి భూముల అప్పగింతపై గ్రామస్తుల అభ్యంతరం

షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 22): షాబాద్ మండలం పెద్దవేడు గ్రామంలో అమెజాన్ కంపెనీకి ప్రభుత్వ భూముల అప్పగింత అంశం చర్చనీయాంశంగా మారింది. గ్రామ ప్రజల అవసరాలకు సంబంధించిన నర్సరీ, క్రీడా ప్రాంగణానికి ముందుగా స్థలం కేటాయించిన తర్వాతే మిగిలిన స్థలాన్ని కంపెనీకి అప్పగించాలని గ్రామ సర్పంచ్ చక్కటి రాజ సులోచన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి అధికారుల తీరుపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూములను కంపెనీలకు కేటాయించే ముందు గ్రామ ప్రజల అవసరాలు, భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆమె సూచించారు. కంపెనీల అభివృద్ధి కోసం అధికారులు చూపుతున్న శ్రద్ధ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారంపై కూడా చూపించాలని కోరారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు స్థలం కేటాయించకుండా భూములను అప్పగించడం సరికాదని పేర్కొన్నారు. అదేవిధంగా పెద్దవేడు గేటు సమీపంలోని పాత ప్రభుత్వ పాఠశాల భవనాన్ని వెంటనే కూల్చివేయవద్దని సర్పంచ్ కోరారు. పాఠశాల పక్కనే నివసిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ నివాస స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే వారి నివాసాలను తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు భరోసా కల్పించకుండా కంపెనీల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకు నష్టం జరగనివ్వం తహశీల్దార్ ఎం.డి. అన్వర్

ఈ విషయంపై షాబాద్ తహశీల్దార్ ఎం.డి. అన్వర్ స్పందిస్తూ...  గ్రామంలో నర్సరీ, క్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం ఇప్పటికే స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. త్వరలోనే ఆ స్థలాన్ని గ్రామ పంచాయతీకి అప్పగిస్తామని వెల్లడించారు. పాత పాఠశాల భవనం పక్కన నివసిస్తున్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ నివాస స్థలాలు కేటాయించిన తర్వాతే వారు ప్రస్తుతం నివసిస్తున్న స్థలాన్ని కంపెనీకి అప్పగిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా పెద్దవేడు గ్రామంలో అత్యాధునిక సౌకర్యాలతో నూతన పాఠశాల భవనాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం కలగకుండా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పరంగా తగిన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.