BREAKING
శెట్టిపాలెం సర్పంచ్ పదవి ఏకగ్రీవం జాలంపల్లి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా బోరా లక్ష్మి నామినేషన్ దాఖలు ఇద్దరు వార్డు మెంబర్లు బిజెపి. తీర్థం కార్తీక మాసం ఫణిగిరి ప్రదక్షిణకు రెండు లక్షల మంది పైగా భక్తుల రాక! శ్రీరామ్ చినబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తరలిరండి : ఏఎంసి డైరెక్టర్,టిడిపి నేత సుబ్రహ్మణ్యం రెడ్డి పిలుపు రుషికొండ బీచ్‌లో విద్యార్థి గల్లంతు! జిల్లాలో 98 శాతం పల్స్ పోలియో పూర్తి అంకిశెట్టిపల్లె వైకాపా సర్పంచ్ అభ్యర్థిగా మోపూరి రెడ్డిశేఖర్ నామినేషన్ : హాజరైన పార్టీ నాయకులు,కార్యకర్తలు పెందుర్తిలో జేడీ ఫౌండేషన్‌ పొలంబడి కార్యక్రమం విశాఖ–తిరువణ్ణామలై ప్రత్యేక రైలును రెగ్యులర్‌ చేయాలి ములకలచెరువు ఎంపీపీ దొరస్వామి నాయుడుకి టిడిపి నేతల సత్కారం : హాజరైన పచ్చిపాల రామకృష్ణ ఆచారి,పఠాన్ ఖాదర్ ఖాన్ వేంపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థినిగా బైగారి భారతి నాయుడు నామినేషన్ : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు,కార్యకర్తలు అమెజాన్ కంపెనీకి భూముల అప్పగింతపై గ్రామస్తుల అభ్యంతరం కొండచిలువను చంపకుండా బంధించిన రైతు.. నర్సింహులు ధైర్యసాహసాలకు అభినందనలు రాచవేటివారిపల్లి టిడిపి అభ్యర్థినిగా అరుణ కుమారి నామినేషన్ : హాజరైన సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్

విశాఖ–తిరువణ్ణామలై ప్రత్యేక రైలును రెగ్యులర్‌ చేయాలి

Select Suryaa Now
విశాఖ–తిరువణ్ణామలై ప్రత్యేక రైలును రెగ్యులర్‌ చేయాలి

రోజువారీ లేదా వారానికి రెండుసార్లు నడపాలి

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ లేఖ

విశాఖపట్నం, నవంబర్‌ 22 (మేజర్‌ న్యూస్‌):

ఉత్తరాంధ్ర శివభక్తుల ప్రయాణ సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైకు నడుస్తున్న ప్రత్యేక రైలును రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాసి భక్తులు ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులను వివరించారు. ప్రస్తుతం విశాఖ–తిరువణ్ణామలై మధ్య 08579/08580 నంబర్లతో నడుస్తున్న ప్రత్యేక రైలు వారానికి ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉండటంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అరుణాచలేశ్వర స్వామి దర్శనం, గిరి ప్రదక్షిణ కోసం ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరువణ్ణామలైకు వెళ్తుంటారని తెలిపారు. ముఖ్యంగా కార్తీక మాసం, పౌర్ణమి, కార్తీక దీపోత్సవం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని వివరించారు. నేరుగా రైలు సౌకర్యం లేకపోవడంతో రెండు, మూడు రైళ్లు మారాల్సి వస్తోందని, దీనివల్ల వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలును శాశ్వత ప్రాతిపదికన రోజువారీ ఎక్స్‌ప్రెస్‌గా లేదా కనీసం వారానికి రెండుసార్లు నడిచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాధవ్‌ విజ్ఞప్తిపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని, సంబంధిత అధికారులతో చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు మాధవ్‌ వెల్లడించారు. ఉత్తరాంధ్ర భక్తుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.