శ్రీరామ్ చినబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తరలిరండి : ఏఎంసి డైరెక్టర్,టిడిపి నేత సుబ్రహ్మణ్యం రెడ్డి పిలుపు
మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా,మదనపల్లి మున్సిపల్ చైర్మనుగా శ్రీరామ్ చినబాబు నేడు అనగా (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం ఆయనను మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్,తెలుగుదేశం పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యం రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయనను మాట్లాడుతూ మదనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబు అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించారని కొనియాడారు.తెలుగుదేశం పార్టీలో అంచలంచెలుగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారన్నారు.గత వైసిపి పాలనలో ఆయనపై ఎన్నో అక్రమ కేసులు బనాయించారని,అయినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగారన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ బాబు ఆశీస్సులతో మున్సిపల్ చైర్మనుగా అద్భుత విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారని ప్రశంసించారు.శ్రీరామ్ చినబాబు సారధ్యంలో మదనపల్లి పట్టణం అభివృద్ధిలో సరికొత్త పుంతలు తొక్కాలని ఆకాంక్షించారు.నేడు ప్రమాణం చేయనున్న మున్సిపల్ చైర్మన్,కూటమి కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి