వెల్దుర్తి మండలంలో జోరుగా నామినేషన్ల పర్వం రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 83, వార్డు సభ్యులకు 234 దాఖలు
వెల్దుర్తి, మేజర్ న్యూస్: పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ వెల్దుర్తి మండలంలో రెండో రోజైన ఆదివారం ఉత్సాహంగా సాగింది. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను ఆదివారం ఒక్కరోజే సర్పంచ్ పదవులకు 83, వార్డు సభ్యుల స్థానాలకు 234 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రెండు రోజులు కలిపి మొత్తం సర్పంచ్ స్థానాలకు 131, వార్డు స్థానాలకు 398 నామినేషన్లు అందినట్లు ఎంపీడీవో ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామ పంచాయతీల వారీగా ఇప్పటివరకు (రెండు రోజుల్లో) దాఖలైన నామినేషన్ల వివరాలు:
వెల్దుర్తి: సర్పంచ్ - 15, వార్డులు - 54
రామళ్లకోట: సర్పంచ్ - 10, వార్డులు - 38
సూదేపల్లి: సర్పంచ్ - 11, వార్డులు - 31
శ్రీరంగపురం: సర్పంచ్ - 6, వార్డులు - 14
షా. బోయనపల్లి: సర్పంచ్ - 6, వార్డులు - 28
నర్సాపురం: సర్పంచ్ - 6, వార్డులు - 24
లక్ష్మీనగరం: సర్పంచ్ - 6, వార్డులు - 24
రత్నపల్లి: సర్పంచ్ - 5, వార్డులు - 22
మాదార్‌పురం: సర్పంచ్ - 7, వార్డులు - 21
సర్పరాజపురం: సర్పంచ్ - 5, వార్డులు - 16
బింగిదొడ్డి: సర్పంచ్ - 4, వార్డులు - 14
చెరుకులపాడు: సర్పంచ్ - 2, వార్డులు - 12
గోవర్ధనగిరి: సర్పంచ్ - 6, వార్డులు - 12
కలుగొట్ల: సర్పంచ్ - 3, వార్డులు - 12
భోగోలు: సర్పంచ్ - 5, వార్డులు - 11
షా. పేరేముల: సర్పంచ్ - 4, వార్డులు - 11
పుల్లగుమ్మి: సర్పంచ్ - 1, వార్డులు - 10
నార్లాపురం: సర్పంచ్ - 7, వార్డులు - 8
కృష్ణాపురం: సర్పంచ్ - 10, వార్డులు - 8
అల్లుగండు: సర్పంచ్ - 2, వార్డులు - 8
బొమ్మిరెడ్డిపల్లి: సర్పంచ్ - 1, వార్డులు - 8
మల్లేపల్లి: సర్పంచ్ - 3, వార్డులు - 7
బుక్కాపురం: సర్పంచ్ - 6, వార్డులు - 5
సోమవారం (23వ తేదీ) నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో అభ్యర్థుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.