BREAKING
ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. జగన్నాధపురం సర్పంచ్ అభ్యర్థిగా కెళ్ళి లక్ష్మి నామినేషన్ దాఖలు అనకాపల్లి జిల్లా మరియు ఛార్జ్ స్థాయి జనగణన శిక్షణా కార్యక్రమం ప్రారంభం జాలంపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పులవర్తి సూర్యప్రకాశరావు నామినేషన్ దాఖలు కురవంక సర్పంచ్ స్థానానికి పసుపులేటి పార్వతమ్మ నామినేషన్ : అభివృద్ధిని చూసి మరో అవకాశం ఇవ్వండి : ప్రజలకు మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి విజ్ఞప్తి పి ఆర్ టి యు ఆధ్వర్యంలో నవోదయ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్ మీ ఓటుతో మల్లేశ్వరిని గెలిపించండి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశీస్సులు అందుకున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్ పృధ్వి మణికంఠ నకిలీ, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్ల పై ఉక్కుపాదం. కోళ్లబైలు,వైఎస్సార్ కాలనీ టిడిపి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు : హాజరైన కోళ్లబైలు ఇంచార్జ్ శ్రీనివాసులు నాయుడు,ఎంపిపి గురునాథ్ యాదవ్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ గా గోపీనాథ్ కొత్తకోట కూటమి అభ్యర్థి పాకలపాటి సునీతకు మద్దతుగా ప్రచారం ప్రజా సేవకు వయసుతో పనిలేదు ఓటర్లు లో అభిమానంతో గెలుపు సాధిస్తా.

చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ గా గోపీనాథ్

Select Suryaa Now
చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ గా గోపీనాథ్

 

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్ : చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ గా 24వ డివిజన్ కార్పొరేటర్ గోపినాథ్ ను అధిష్టానం ఖరారు చేసింది. నరిగపల్లి గ్రామానికి చెందిన గోపీనాథ్ సాధారణ రైతు కుటుంబంలో జన్మించి బెంగుళూరు నగరంలో పలు వ్యాపారాలు చేపట్టి పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. తాను పుట్టి పెరిగిన చిత్తూరు నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇటీవల జరిగిన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 24 వ డివిజన్ కార్పొరేటర్ గా నామినేషన్ దాఖలు చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ తన సొంత గ్రామంతో పాటు నగరంలోని పలు ప్రదేశాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా తన సొంత నిధులతో 24వ డివిజన్ లో మంచినీటి బోర్లు తవ్వకం, ఇతర సదుపాయాలను కల్పించారు. యువ నాయకుడు కావడం ఆర్థికంగా స్థితి మంత్రాలుగా ఉంటూ సేవా కార్యక్రమాలు దూసుకుపోతున్నాడంతో డిప్యూటీ మేయర్ పదవిని గోపీనాథ్ కు కేటాయిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆయన ఆదివారం రాత్రి కార్పొరేటర్ గోపీనాథ్ మేజర్ న్యూస్ తో మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన డివిజన్ తో పాటు, నగరంలోని ఇతర డివిజన్లలోనూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని స్పష్టం చేశారు. తనకు జడ్పిటి మేయర్ పదవిని కేటాయించడం పట్ల పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, యువ మంత్రి లోకేష్, చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు ఆయన ఆ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.