అనకాపల్లి జిల్లా మరియు ఛార్జ్ స్థాయి జనగణన శిక్షణా కార్యక్రమం ప్రారంభం
అనకాపల్లి ప్రతినిధి , మేజర్ న్యూస్ : కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం జిల్లా మరియు ఛార్జ్ స్థాయి అధికారులకు రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి & జిల్లా జనగణన అధికారి వై.ఎస్.వి.కె.జి.ఎస్.ఎల్. సత్యనారాయణ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనగణన ప్రక్రియ అత్యంత కీలకమైనదని, క్షేత్రస్థాయిలో ఎటువంటి తప్పులకు తావులేకుండా అత్యంత ఖచ్చితత్వంతో మరియు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ శిక్షణలో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ దయా సాగర్ మరియు మాస్టర్ ట్రైనర్ డాక్టర్ జగన్నాథ పూరి శిక్షకులుగా వ్యవహరిస్తూ, జనగణన విధివిధానాలు, డేటా సేకరణ పద్ధతులు, డిజిటల్ యాప్ వినియోగం మరియు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సందేహాల నివృత్తిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు.రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీవోలు తహశీల్దార్లు ఎంపీడీవోలు డిప్యూటీ తహశీల్దార్లు, ఏఎస్వోలు మరియు ఇతర సంబంధిత ఛార్జ్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.