వైసిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తలుపుల లావణ్య గెలుపు కోసం కోడిమిలో విస్తృత ప్రచారం
అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ మండలం కొడిమి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి బలపరిచిన తలుపుల లావణ్యను పంపించాలని వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తలుపుల లావణ్య, పార్టీ నాయకులు ,కార్యకర్తలు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. ఎన్నికల అధికారులు కేటాయించిన.. మంచం గుర్తుకు ఓటు వేసి.. గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో.. అప్పటి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. గత రెండున్నర కూటమి ప్రభుత్వ పాలనలో.. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా.. మోసం చేశారని వివరించారు. గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీ ఎన్నికల్లో మంచం గుర్తుకు ఓటు వేసి వైసిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.