BREAKING
అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! సేవా కార్యక్రమంతో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల ముగింపు ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అరాచక రాజకీయాల సృష్టించవద్దు - ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పొన్నూరు మండలం ఆలూరు గ్రామ నివాసి అంబటి వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు........ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కొడిమిలో వైసిపి నాయకులు ,కార్యకర్తలు విస్తృత ప్రచారం రెండో రోజు భారీగా నామినేషన్లు! మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. - మంత్రి అచ్చెన్నాయుడు కొడిమిలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తొగట అపర్ణ గెలుపు కోసం విస్తృత ప్రచారం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థినులు ఎంపిక ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. జగన్నాధపురం సర్పంచ్ అభ్యర్థిగా కెళ్ళి లక్ష్మి నామినేషన్ దాఖలు అనకాపల్లి జిల్లా మరియు ఛార్జ్ స్థాయి జనగణన శిక్షణా కార్యక్రమం ప్రారంభం జాలంపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పులవర్తి సూర్యప్రకాశరావు నామినేషన్ దాఖలు

రెండో రోజు భారీగా నామినేషన్లు!

Select Suryaa Now
రెండో రోజు భారీగా నామినేషన్లు!

 నౌపడ కేంద్రంలో అట్టహాసంగా సుగ్గు పద్మలతాదేవి, అట్టాడ కల్పన నామినేషన్లు

 రెండో రోజు మొత్తం 425 నామినేషన్లు దాఖలు

సంతబొమ్మాళి, మేజర్ న్యూస్ : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రెండో రోజైన ఆదివారం భారీ స్పందన లభించింది. మండలంలోని పది నామినేషన్ కేంద్రాల పరిధిలో 34 గ్రామ పంచాయతీలకు సంబంధించి మొత్తం 425 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 148 మంది సర్పంచి అభ్యర్థులుగా, 277 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు సమర్పించారు. నౌపడ నామినేషన్ కేంద్రం ఆదివారం జనసందోహంతో సందడిగా మారింది. సుగ్గు పద్మలతాదేవి, అట్టాడ కల్పన నామినేషన్ల సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు, గ్రామస్తులు తరలిరావడంతో కేంద్రం వద్ద సందడి నెలకొంది. భారీగా తరలివచ్చిన జనాల మధ్య అట్టహాసంగా వారు తమ నామినేషన్లను దాఖలు చేశారు. సుగ్గు పద్మలతాదేవి నామినేషన్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ఆమె తనయుడు, సంతబొమ్మాళి ఎంపీపీ సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి పాల్గొన్నారు. స్వయంగా తన తల్లిని వెంటబెట్టుకుని నామినేషన్ కేంద్రానికి చేరుకున్న ఆయన, నామినేషన్ ప్రక్రియలో దగ్గరుండి పాల్గొని ఆమెతో నామినేషన్ వేయించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మద్దతుదారులు తరలిరావడంతో నౌపడ కేంద్రం వద్ద సందడి నెలకొంది.
ఇదిలా ఉండగా హనుమంతునాయుడుపేట, యామలపేట, ఆకాశలక్కవరం గ్రామాల్లో సర్పంచి అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పాల వసంతరెడ్డి హాజరయ్యారు. రెండో రోజు నామినేషన్లతో మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.