BREAKING
అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! సేవా కార్యక్రమంతో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల ముగింపు ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అరాచక రాజకీయాల సృష్టించవద్దు - ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పొన్నూరు మండలం ఆలూరు గ్రామ నివాసి అంబటి వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు........ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కొడిమిలో వైసిపి నాయకులు ,కార్యకర్తలు విస్తృత ప్రచారం రెండో రోజు భారీగా నామినేషన్లు! మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. - మంత్రి అచ్చెన్నాయుడు కొడిమిలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తొగట అపర్ణ గెలుపు కోసం విస్తృత ప్రచారం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థినులు ఎంపిక ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. జగన్నాధపురం సర్పంచ్ అభ్యర్థిగా కెళ్ళి లక్ష్మి నామినేషన్ దాఖలు అనకాపల్లి జిల్లా మరియు ఛార్జ్ స్థాయి జనగణన శిక్షణా కార్యక్రమం ప్రారంభం జాలంపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పులవర్తి సూర్యప్రకాశరావు నామినేషన్ దాఖలు

కొడిమిలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తొగట అపర్ణ గెలుపు కోసం విస్తృత ప్రచారం

Select Suryaa Now
కొడిమిలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తొగట అపర్ణ గెలుపు కోసం విస్తృత ప్రచారం
 
 
 పంచాయతీ అభివృద్ధి కోసం సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి
 
 - కొడిమి గ్రామ ఎన్నికల ప్రచారంలో  కూటమి సర్పంచ్ అభ్యర్థి తొగట ఆపర్ణ నారాయణస్వామి ప్రజలకు విజ్ఞప్తి
 
అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ :
అనంతపురము రూరల్ మండలం కొడిమి గ్రామపంచాయతీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తోగట అపర్ణ నారాయణస్వామి  గెలుపు కోసం టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆదివారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు కేటాయించిన కత్తెర గుర్తుకు, వార్డు సభ్యుల గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభ్యర్థి తోగుట  అపర్ణ నారాయణస్వామి  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని,  
 ప్రజలకు వివరించారు.  గ్రామ అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారానే ప్రభుత్వ, ఎమ్మెల్యేల సహకారంతో నిధులను తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తానని  తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలందరూ ఆలోచించి  కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.