BREAKING
అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! సేవా కార్యక్రమంతో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల ముగింపు ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అరాచక రాజకీయాల సృష్టించవద్దు - ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పొన్నూరు మండలం ఆలూరు గ్రామ నివాసి అంబటి వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు........ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కొడిమిలో వైసిపి నాయకులు ,కార్యకర్తలు విస్తృత ప్రచారం రెండో రోజు భారీగా నామినేషన్లు! మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. - మంత్రి అచ్చెన్నాయుడు కొడిమిలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తొగట అపర్ణ గెలుపు కోసం విస్తృత ప్రచారం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థినులు ఎంపిక ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. జగన్నాధపురం సర్పంచ్ అభ్యర్థిగా కెళ్ళి లక్ష్మి నామినేషన్ దాఖలు అనకాపల్లి జిల్లా మరియు ఛార్జ్ స్థాయి జనగణన శిక్షణా కార్యక్రమం ప్రారంభం జాలంపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పులవర్తి సూర్యప్రకాశరావు నామినేషన్ దాఖలు

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థినులు ఎంపిక

Select Suryaa Now
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థినులు ఎంపిక

​కోటబొమ్మాళి,  మేజర్ న్యూస్: పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో ఈ నెల 26 నుంచి 29 వరకు జరగనున్న 52వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థినులు జె. చంద్రలేఖ, జె. కవిత ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అరంగి అప్పన్న ఆదివారం వెల్లడించారు. అక్టోబరు 16 నుంచి 18 వరకు మార్కాపురంలో నిర్వహించిన 52వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్‌లో శ్రీకాకుళం జిల్లా బాలికల జట్టు తరఫున ఆడి వీరు తృతీయ స్థానం సాధించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను డివిఈవో ఆర్. సురేష్, ఎంఈవో డబ్బీరు గోవిందరావు, కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అభినందించి, పోటీలలో మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.