BREAKING
చినంచల సర్పంచ్ అభ్యర్థిగా పినకాన ముకుంద రావును ఆదరించండి. శేఖరాపురంలో టీడీపీలోకి 50 కుటుంబాలు అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ రాచానుపల్లి కూటమి బలపరిచిన అభ్యర్థి నాగరాజు యాదవ్ జోరుగా ఎన్నికల ప్రచారం అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! సేవా కార్యక్రమంతో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల ముగింపు ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అరాచక రాజకీయాల సృష్టించవద్దు - ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పొన్నూరు మండలం ఆలూరు గ్రామ నివాసి అంబటి వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు........ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కొడిమిలో వైసిపి నాయకులు ,కార్యకర్తలు విస్తృత ప్రచారం రెండో రోజు భారీగా నామినేషన్లు! మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. - మంత్రి అచ్చెన్నాయుడు కొడిమిలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తొగట అపర్ణ గెలుపు కోసం విస్తృత ప్రచారం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థినులు ఎంపిక ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు

ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అరాచక రాజకీయాల సృష్టించవద్దు - ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఈఆర్

Select Suryaa Now
ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అరాచక రాజకీయాల సృష్టించవద్దు - ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఈఆర్

రణస్థలం, మేజర్ న్యూస్ : 2024 ఎన్డిఏ కూటమి ప్రభుత్వంనకు ప్రజలు మంచి మద్దతునిచ్చారు. ప్రజలు నమ్మకాన్ని నిలబెడుతూ వచ్చామని ఎచ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు (ఎన్.ఈ.ఆర్) తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. నేటికీ రెండున్నర సంవత్సరాలు పరిపాలనలో ప్రజలు కూటముపై పెట్టుకున్న నమ్మకం ఎక్కడ చెదరలేదు అందుకు నిదర్శనం ఇటీవల జరిగినటువంటి ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో ఎచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలలో నాలుగు జడ్పిటిసి, మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను కైవాసం చేసుకున్నామని అన్నారు. ప్రజలు ఇచ్చినటువంటి ఆ మెజార్టీని చూడలేక ఎచ్చెర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఇప్పుడు జరగబోతున్న పంచాయతీ ఎన్నికలలో అరాచకాలు సృష్టించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగవలసిన ఎన్నికలను ప్రశాంతంగా జరగనీయకుండా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా జరగవలసిన పంచాయతీ ఎన్నికలను గ్రామాలలో సోదర భావాలతో ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు దీన్ని గమనిస్తున్నారని అన్నారు. బంటుపల్లి,కమ్మ సిగడాం పంచాయతీలలో శోధన భావంగా ఉన్న ప్రజలు మధ్య చిచ్చు పెట్టి ఎస్సి కులస్తుల ద్వారా కేసులు పెట్టిస్తున్నారని, గతంలో కూడా ఇటువంటి కేసులు మాపై ఎన్నో పెట్టి నానా ఇబ్బందులు పెట్టారని గ్రామాలలో సమస్యలు వస్తే పెద్దలుగా సర్దు చెప్పవలసిన వారు ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. గొర్లె కిరణ్ కుమార్ ఎంపీపీగా ఉన్నప్పుడు నుంచి చిల్లర రాజకీయాలు చేస్తూ ఎస్సీ కులస్తులను పావులుగా వాడుకుంటున్నారని అన్నారు. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయడం ద్వారా ప్రజలు 2024, 2026లో బుద్ధి చెప్పారని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మెలగాలని అన్నారు. తమ పార్టీ సొంత మీడియా సాక్షి టీవీ పేపర్ ద్వారా తప్పుడు ప్రచారాలు, తప్పుడు వార్తలు రాసి వాటి మీద ప్రజలకి నమ్మకం పోయేలా చేస్తున్నారని అన్నారు. శనివారం బంటుపల్లి లో  జరిగినటువంటి సంఘటనలో ప్రత్యేక సాక్ష్యాలు కూడా తారుమారు చేసి ఒక వ్యక్తి షర్టు చింపి కొట్టేసినట్లుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. పంచాయతీలే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు అని పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అటువంటి వారికి ప్రభుత్వం మరింత అభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు. దీనివల్ల ప్రజలలో కక్షలు కార్పన్యాలు ఉండకుండా వారి పంచాయతీ అభివృద్ధికి అందరూ ఏకగ్రీవంతో ముందుకి తీసుకెళ్తారని ఏకగ్రీవానికి ప్రభుత్వం ప్రోత్సాహాలు అందిస్తుందని  అన్నారు అందులో భాగంగా మన వంతు ప్రయత్నం చేయడంలో తప్పు లేదని ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండటమే తమ ఉద్దేశమని అన్నారు. నా సొంత పంచాయతీ అయినటువంటి బంటుమిల్లిలో మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ 2019 నుంచి 2024 వరకు ఎన్నో అరాచకాలను సృష్టించి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టి అనేకమైన కేసులు పెట్టి ఇరికించారు. ఆయన చేసిన పనులను నేను దృష్టిలో పెట్టుకుంటే 2024లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చేసే పనులను దృష్టిలో పెట్టుకుంటే ఎన్నో విధాలుగా వారిని ఇబ్బందులు పెట్టొచ్చు కానీ వారిలాగే నేను కూడా చేస్తే ఆయనకి నాకు తేడా ఏమంటుంది ? ఎప్పుడైనా మారరా అని అన్ని మర్చిపోయాను అందుకే రెండున్నర సంవత్సరాలలో బంటుపల్లి పంచాయతీ నుంచి ఎటువంటి కేసులు లేకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారని అన్నారు. ఎంపీటీసీ ఎన్నికలలో బంటుపిల్లిలో ఓడిపోతానని ఆయన క్యాండిడేట్ ని పోటీలో పెట్టలేదు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వచ్చిందని అమాయకులైన ఎస్సీలని పావులుగా వాడుకొని వారి మధ్య చిచ్చు పెట్టి గొడవలకు పురుకొలుపుతున్నారని అన్నారు. ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ప్రజలు పూర్తి మద్దతు గెలుస్తారని ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో జరిగేటట్లు చూస్తామని అన్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ లెంక  శ్యామలరావు మాట్లాడుతూ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరుపున ఎమ్మెల్యే టిడిపి నుంచి శ్యామల రావు అనే నేను జనసేన నుంచి విశ్వక్సేన్ మూడు పార్టీలకు చెందినటువంటి ముగ్గురుము కోలంకషంగా చర్చించి జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను ఎంపిక చేయటం వలన ఈరోజు నాలుగు మండలాల నుంచి కూటమి నిలబెట్టినటువంటి అభ్యర్థులు జడ్పిటిసిలుగా ఎంపీపీలుగా నియమితులయ్యారని అన్నారు. ఇదే తరహాలో ఎచ్చెర్ల నియోజకవర్గం లో పంచాయతీ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ప్రజల మద్దతుతో పూర్తి మెజార్టీతో గెలుపొందుతారని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.