BREAKING
పలాసలో మాక్ కౌన్సిల్ సమావేశం. వైస్ చైర్మన్ ఎంపికపై ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి దిశానిర్దేశం. వైద్య సేవలో ఆర్.ఎం.పి పి.ఎం.పి సేవల పాత్ర కీలకం ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక.. 66 స్థానాలకు కూటమి జాబితా విడుదల సామూహిక వేదపారాయణంతో మార్మోగిన సాయి సమితి ప్రాంగణం. కోటిపల్లి అభివృద్ధికి కోటి హామీ చినంచల సర్పంచ్ అభ్యర్థిగా పినకాన ముకుంద రావును ఆదరించండి. శేఖరాపురంలో టీడీపీలోకి 50 కుటుంబాలు అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ రాచానుపల్లి కూటమి బలపరిచిన అభ్యర్థి నాగరాజు యాదవ్ జోరుగా ఎన్నికల ప్రచారం అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! సేవా కార్యక్రమంతో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల ముగింపు ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అరాచక రాజకీయాల సృష్టించవద్దు - ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పొన్నూరు మండలం ఆలూరు గ్రామ నివాసి అంబటి వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు........ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కొడిమిలో వైసిపి నాయకులు ,కార్యకర్తలు విస్తృత ప్రచారం రెండో రోజు భారీగా నామినేషన్లు!

అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

Select Suryaa Now
అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

 

144 మద్యం బాటిళ్లు, టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనం స్వాధీనం

గుడుపల్లి మేజర్ న్యూస్: అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుడుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 144 మద్యం బాటిళ్లతో పాటు తరలింపునకు ఉపయోగించిన టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గుడుపల్లి మండలంలోని గుండ్లసాగరం గ్రామ సమీపంలో కుప్పం–ద్రావిడ విశ్వవిద్యాలయం రహదారిపై ఉన్న అగ్నిమారెమ్మ ఆలయం వద్ద ఆదివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై రెండు తెల్లటి ప్లాస్టిక్ సంచుల్లో మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి వాహనాన్ని వెనక్కి తిప్పుకొని పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు.

విచారణలో నిందితులను గుడుపల్లి మండలం కనమనపల్లి గ్రామానికి చెందిన సి. మల్లికార్జున (59), కుప్పం మండలం పలార్లపల్లి గ్రామానికి చెందిన ఆర్. శ్రీనివాసులు (63)గా గుర్తించారు. వారి వద్ద ఉన్న సంచులను తనిఖీ చేయగా వివిధ బ్రాండ్లకు చెందిన మొత్తం 144 మద్యం బాటిళ్లు, 42.840 లీటర్ల మద్యం లభ్యమైంది. వీటి విలువ రూ.19,380 ఉంటుందని పోలీసులు తెలిపారు. మద్యం తరలింపునకు ఉపయోగించిన టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై గుడుపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 79/2026 కింద ఏపీ ప్రొహిబిషన్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు గుడుపల్లి ఎస్సై డి. శ్రీనివాసులు తెలిపారు. అక్రమ మద్యం రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

సూర్య రిపోర్టర్: లెనిన్ గుడిపల్లి మండలం