BREAKING
రాష్ట్రస్థాయి కరాటిపుటీల్లో కాంస్య పతకం పొన్నూరు పట్టణం 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి గేరా కుమారి ముమ్మర ప్రచారం పెదంచల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పీరికట్ల అంజి ఏకగ్రీవ ఎన్నిక. కేబీసీ 18 వివాదం: అమితాబ్ బచ్చన్, సోనీ టీవీకి లీగల్ నోటీసులు రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. పిసినికాడ జాతీయ రహదారిపై ప్రమాదం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా రాజమహేంద్రవరం అభివృద్ధికి త్రిబుల్ ఇంజన్ సర్కార్ అవసరం పలాసలో మాక్ కౌన్సిల్ సమావేశం. వైస్ చైర్మన్ ఎంపికపై ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి దిశానిర్దేశం. వైద్య సేవలో ఆర్.ఎం.పి పి.ఎం.పి సేవల పాత్ర కీలకం ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక.. 66 స్థానాలకు కూటమి జాబితా విడుదల సామూహిక వేదపారాయణంతో మార్మోగిన సాయి సమితి ప్రాంగణం. కోటిపల్లి అభివృద్ధికి కోటి హామీ చినంచల సర్పంచ్ అభ్యర్థిగా పినకాన ముకుంద రావును ఆదరించండి. శేఖరాపురంలో టీడీపీలోకి 50 కుటుంబాలు అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

వైద్య సేవలో ఆర్.ఎం.పి పి.ఎం.పి సేవల పాత్ర కీలకం

Select Suryaa Now
వైద్య సేవలో ఆర్.ఎం.పి పి.ఎం.పి సేవల పాత్ర కీలకం

నేటి దినపత్రిక సూర్యబ్యూరో  రాజమహేంద్రవరంగ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతర వైద్య సేవలందిస్తున్న ఆర్ఎంపీలు, పిఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు కల్పించేందుకు కేంద్రంతో చర్చిస్తానని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ఆర్ఎంపీ, పిఎంపీ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన ఆయన, దశాబ్దాలుగా సేవలందిస్తున్న వారి అనుభవాన్ని గుర్తించి, పరీక్షలు నిర్వహించి, మూడు నాలుగు నెలల శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అవసరమైన సందర్భాల్లో రోగులను నిపుణులైన వైద్యుల వద్దకు పంపించాలని సూచించారు. ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా గ్రామీణ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. బీజేపీ ఏపీ ఇంఛార్జి అరవింద్ సింగ్ భదోరియా, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యమని తెలిపారు.