రాష్ట్రస్థాయి కరాటిపుటీల్లో కాంస్య పతకం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్‌లో అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి యాళ్ళ నరసింహస్వామి కరాటే పోటీల్లో సత్తా చాటి కాంస్య పతకం సాధించాడు. పాలకొండలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్-17 విభాగంలో పాల్గొన్న నరసింహస్వామి ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు.రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో నరసింహస్వామి తనదైన ప్రదర్శనతో పతకాన్ని అందుకోవడం విశేషం. కోచ్ పడాల అంజి మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన అతను రాష్ట్రస్థాయిలో విజయం సాధించి పాఠశాలకు, కుటుంబానికి గర్వకారణంగా నిలిచాడు. విద్యార్థి సాధించిన విజయంపై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మను విహార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. కోచ్ పడాల అంజి సైతం తన శిష్యుడి ప్రతిభను ప్రశంసిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.