పెదంచల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పీరికట్ల అంజి ఏకగ్రీవ ఎన్నిక.
పలాస,మేజర్ న్యూస్: పలాస మండలం పెదంచల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పీరికట్ల అంజి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం పలాస ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పలాస శాసన సభ్యులు గౌతు శిరీష ని మర్యాదపూర్వకంగా కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మిఠాయి పంపిణీ చేసి ఏకగ్రీవ ఎన్నిక పట్ల సంతోషాన్ని పంచుకున్నారు. గ్రామ ప్రజల ఐక్యత, నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో ఈ ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు.