BREAKING
జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షలో సనపల అనన్యకు ప్రథమ స్థానం 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం..పౌర్ణమి గరుడ సేవ రద్దు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించండి వైసిపి ఉనికి కోల్పోతుంది కరగాం సర్పంచ్ అభ్యర్థిగా పంగ కృష్ణవేణి నామినేషన్ కిమ్స్ ఆస్పత్రిలో సిబ్బందికి క్రీడోత్సవాలు రణస్థలం మండల ప్రజా పరిషత్ రాష్ట్రస్థాయి కరాటిపుటీల్లో కాంస్య పతకం పొన్నూరు పట్టణం 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి గేరా కుమారి ముమ్మర ప్రచారం పెదంచల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పీరికట్ల అంజి ఏకగ్రీవ ఎన్నిక. కేబీసీ 18 వివాదం: అమితాబ్ బచ్చన్, సోనీ టీవీకి లీగల్ నోటీసులు రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. పిసినికాడ జాతీయ రహదారిపై ప్రమాదం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా రాజమహేంద్రవరం అభివృద్ధికి త్రిబుల్ ఇంజన్ సర్కార్ అవసరం పలాసలో మాక్ కౌన్సిల్ సమావేశం. వైస్ చైర్మన్ ఎంపికపై ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి దిశానిర్దేశం.

కేబీసీ 18 వివాదం: అమితాబ్ బచ్చన్, సోనీ టీవీకి లీగల్ నోటీసులు

Select Suryaa Now
కేబీసీ 18 వివాదం: అమితాబ్ బచ్చన్, సోనీ టీవీకి లీగల్ నోటీసులు

న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ క్విజ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి 18' (KBC 18)లో పంజాబ్ రాష్ట్రంపై అడిగినట్లుగా చెబుతున్న ఒక ప్రశ్న తీవ్ర వివాదానికి దారితీసింది. ఇటీవల పోలీస్ స్టేషన్లపై నేరగాళ్లు బాంబు దాడులకు పాల్పడిన రాష్ట్రం ఏదంటూ రూ. 12.5 లక్షల బహుమతి కోసం అమితాబ్ బచ్చన్ ఒక పోటీదారుడిని ప్రశ్నించినట్లు ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్లిప్‌లో ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ఆప్షన్లుగా ఇవ్వగా, చివరకు 'పంజాబ్' సరైన సమాధానమని ప్రకటించినట్లు కనిపిస్తోంది.

ఈ వ్యవహారంపై పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందిన న్యాయవాది ఇంద్రజీత్ అరోరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమితాబ్ బచ్చన్‌తో పాటు సోనీ టీవీకి లీగల్ నోటీసులు పంపారు. ఇది కేవలం సాధారణ పరిజ్ఞానాన్ని (జనరల్ నాలెడ్జ్) పరీక్షించే ప్రశ్నలా కాకుండా, ఒక రాష్ట్ర ప్రతిష్టను, పరువును దెబ్బతీసే ప్రయత్నంగా ఉందని ఆయన తన నోటీసులో పేర్కొన్నారు. వివాదాస్పద వీడియోను జాతీయ మీడియా వేదికల నుంచి వెంటనే తొలగించాలని, ఆ ఫుటేజ్ నిజంగానే షోలో ప్రసారమైనట్లు నిర్ధారణ అయితే అమితాబ్ బచ్చన్ మరియు సోనీ టీవీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో నిజంగా కేబీసీ కార్యక్రమంలో భాగమేనా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మార్ఫింగ్ చేసి సృష్టించారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అమితాబ్ బచ్చన్, సోనీ టీవీ యాజమాన్యం నుంచి అధికారిక స్పందన వచ్చిన తర్వాతే దీని అసలు నిజం బయటపడుతుందని, ఒకవేళ ఇది నకిలీ వీడియో అని తేలితే దీనిని తయారు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని న్యాయవాది స్పష్టం చేశారు.