BREAKING
సర్పంచ్ అభ్యర్థిగా ధర్మాన ప్రభాకర్ రావు నామినేషన్ దాఖలు శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి బాధ్యత తీసుకుంది.. అఖండ మెజారిటీతో గెలిపించండి– కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షలో సనపల అనన్యకు ప్రథమ స్థానం 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం..పౌర్ణమి గరుడ సేవ రద్దు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించండి వైసిపి ఉనికి కోల్పోతుంది కరగాం సర్పంచ్ అభ్యర్థిగా పంగ కృష్ణవేణి నామినేషన్ కిమ్స్ ఆస్పత్రిలో సిబ్బందికి క్రీడోత్సవాలు రణస్థలం మండల ప్రజా పరిషత్ రాష్ట్రస్థాయి కరాటిపుటీల్లో కాంస్య పతకం పొన్నూరు పట్టణం 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి గేరా కుమారి ముమ్మర ప్రచారం పెదంచల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పీరికట్ల అంజి ఏకగ్రీవ ఎన్నిక. కేబీసీ 18 వివాదం: అమితాబ్ బచ్చన్, సోనీ టీవీకి లీగల్ నోటీసులు రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. పిసినికాడ జాతీయ రహదారిపై ప్రమాదం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా

వైసిపి ఉనికి కోల్పోతుంది

Select Suryaa Now
వైసిపి ఉనికి కోల్పోతుంది

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఅనపర్తి నియోజకవర్గంలో వైసీపీ రాజకీయంగా ఉనికి కోల్పోతోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు 99 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయాన్ని అందించారని, నాలుగు జెడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీ స్థానాలతో పాటు 76 ఎంపీటీసీ స్థానాలకు గాను 71 స్థానాల్లో కూటమికి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ప్రజలిచ్చిన తీర్పును వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక గ్రామాల్లో ఏకగ్రీవాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.అనపర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటికే పది గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయని, మరికొన్ని గ్రామాలు కూడా అదే దిశగా పయనిస్తున్నాయని తెలిపారు. గొల్లలమామిడాడ, బిక్కవోలు వంటి పెద్ద గ్రామాల్లోనూ ఏకగ్రీవ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం అనపర్తి, పొలమూరు, రామవరం గ్రామాల్లో ఏకగ్రీవాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.గత ఐదేళ్లలో అనపర్తి గ్రామంలో అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి, కెనాల్ రోడ్డు, రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు చేపట్టామని వివరించారు. కెనాల్ రోడ్డును సుమారు రూ.750 కోట్లతో నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయని వెల్లడించారు. అలాగే రూ.38 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనపర్తి గ్రామాన్ని నగర పంచాయతీగా మార్చే ప్రయత్నాలను గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, గ్రామ పంచాయతీగానే కొనసాగించాలన్న ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, జెడ్పీటీసీలు రావాడ నాగేశ్వరరావు, నల్లమిల్లి ఆదిలక్ష్మి, వాసంశెట్టి నాగేశ్వరరావు, ఎంపీపీలు సుభాషిణి, అనసూరి నాగేశ్వరరావు, పుట్టా వి.వి. సత్యవేణి, ముంగి మురళి తదితరులు పాల్గొన్నారు.