BREAKING
సర్పంచ్ అభ్యర్థిగా ధర్మాన ప్రభాకర్ రావు నామినేషన్ దాఖలు శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి బాధ్యత తీసుకుంది.. అఖండ మెజారిటీతో గెలిపించండి– కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షలో సనపల అనన్యకు ప్రథమ స్థానం 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం..పౌర్ణమి గరుడ సేవ రద్దు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించండి వైసిపి ఉనికి కోల్పోతుంది కరగాం సర్పంచ్ అభ్యర్థిగా పంగ కృష్ణవేణి నామినేషన్ కిమ్స్ ఆస్పత్రిలో సిబ్బందికి క్రీడోత్సవాలు రణస్థలం మండల ప్రజా పరిషత్ రాష్ట్రస్థాయి కరాటిపుటీల్లో కాంస్య పతకం పొన్నూరు పట్టణం 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి గేరా కుమారి ముమ్మర ప్రచారం పెదంచల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పీరికట్ల అంజి ఏకగ్రీవ ఎన్నిక. కేబీసీ 18 వివాదం: అమితాబ్ బచ్చన్, సోనీ టీవీకి లీగల్ నోటీసులు రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. పిసినికాడ జాతీయ రహదారిపై ప్రమాదం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా

24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం..పౌర్ణమి గరుడ సేవ రద్దు

Select Suryaa Now
24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం..పౌర్ణమి గరుడ సేవ రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణ‌మినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. 

????ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. 

????ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.