రణస్థలం మండల ప్రజా పరిషత్
ప్రత్యేక ఆహ్వానితునిగా తేజ బాబు
రణస్థలం, మేజర్ న్యూస్ : రణస్థలం మండల ప్రజా పరిషత్ ప్రత్యేక ఆహ్వానితునిగా ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు ( ఎన్ ఈ ఆర్ ) కుమారుడు యువ నాయకుడు నడుకుదిటి తేజ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సమక్షంలో, ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామలరావు , ఎంపీపీ లంక ప్రభాకరరావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామకంతో మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల్లో యువ నాయకుడిగా తేజ బాబు మరింత కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎంపిపి లంక ప్రభాకరరావుకి, ప్రత్యేక ఆహ్వానితులు తేజబాబు కి రణస్థలం ఎంపీటీసీలు మరియు ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.