కిమ్స్ ఆస్పత్రిలో సిబ్బందికి క్రీడోత్సవాలు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఈ నెల 22 వ తేదీ ఆది వారం కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది వార్షిక క్రీడోత్సవాలు కిమ్స్ చైర్మన్ కె.వి.వి.సత్యనారాయణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం క్రికెట్ మరియు వాలీ బాల్ ఆటలలో పాల్గొని సిబ్బందిని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా కిమ్స్ చైర్మన్ కె.వి.వి.సత్యనారాయణ రాజు మాట్లాడుతూఆరోగ్యమే మహా భాగ్యం" అని, క్రీడలు శారీరక మరియు మానసిక ఆరోగ్యానికే కాక మానవ సంబంధాలను బలపరచేందుకు మరియు సిబ్బందిలో ఐక్యమత్యాన్ని పెంపొందించేందుకు కూడా దోహద పడతాయని, ఒక జట్టులో ఇతర సిబ్బందితో కలిసి మెలిసి కార్య సాధనకు ఎలా కృషి చేయాలో తెలుపుతామని చెప్పారు.
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో వివిధ క్రీడలలో సిబ్బందికి పోటీలు నిర్వహించి జనవరిమొదటి వారంలో "కిమ్స్ వార్షికోత్సవ" సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేస్తామని కిమ్స్ మానవ వనరుల జనరల్రాధా మనోహర్ తెలిపారు. ఈ క్రీడోత్సవాలలో పురుషులకు క్రికెట్, వాలీ బాల్, షటిల్ బ్యాడ్మింటన్,, చెస్ మరియు కారమ్స్ లలో మరియు మహిళలకు థ్రో బాల్, ఖో ఖో, బాడ్మింటన్, చెస్ మరియు కారమ్స్ లలో పోటీలు నిర్వహిస్తామని, మరియు అందరికీ వాకథాన్ కూడా నిర్వహిస్తామని కిమ్స్ యాజమాన్యం సిబ్బంది ఆరోగ్యం మరియు మనోల్లాసం కొరకు క్రీడోత్సవాలను మరియు "కిమ్స్ వార్షికోత్సవ్ " ను నిర్వహించడం చాలా సంతోషించదగిన విషయమని తెలిపి, క్రీడలను ప్రోత్సహిస్తున్న కిమ్స్ ఎం.డి. శ్రీ రవి వర్మ మరియు చైర్మన్ కె.వి.వి.సత్యనారాయణ రాజు సిబ్బంది తరపున రాధా మనోహర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ వైస్ ప్రెసిడెంట్ మోహన రాజు మెడికల్ డైరెక్టర్ డా.హరి కిరణ్ వర్మ సి.ఏ.ఓ. శ్రీ రఘు , అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లు డా.వరద, డా.సలాం మరియు అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డా.శరణ్య , కిమ్స్ ఫిజికల్ డైరెక్టర్ లు నాగ రాజు, మాధవి మరియు బాబు ,పలువురు వైద్యులు మరియు సహాయ సిబ్బంది పాల్గొన్నారు.