BREAKING
క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పచ్చల నడుకుడలో ఎస్ఎస్సీ 1986-87 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కూటమి పార్టీల మద్దతుతో వార్డుల అభ్యర్థుల నామినేషన్... నరసన్నపేట, నవంబర్ 22 మేజర్ న్యూస్: నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. 10, 12, 13, 14, 17వ వార్డులకు చెందిన అభ్యర్థులు భారీ ప్రదర్ మెండోరా మండల అభివృద్ధికి రూ.2.85 కోట్ల నిధులు మంజూరు పచ్చల నడుకుడలో శ్రీశ్రీశ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఓటు హక్కు గురించి ప్రశ్నించే అర్హత లేదు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి గ్రంథాలయ సంస్థ చైర్మన్ యువత స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి సీతారామ భద్రాక్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళం అయోధ్య నుంచి జనక్‌పూర్ వరకు కొత్త రైలు సర్వీసు.. రేపు ప్రారంభించనున్న ఇరు దేశాల ప్రధానులు మేయర్ పదవే రాజకీయ లక్ష్యమా..? సర్పంచ్ అభ్యర్థిగా ధర్మాన ప్రభాకర్ రావు నామినేషన్ దాఖలు శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి బాధ్యత తీసుకుంది.. అఖండ మెజారిటీతో గెలిపించండి– కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షలో సనపల అనన్యకు ప్రథమ స్థానం 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం..పౌర్ణమి గరుడ సేవ రద్దు

శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి బాధ్యత తీసుకుంది.. అఖండ మెజారిటీతో గెలిపించండి– కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

Select Suryaa Now
శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి బాధ్యత తీసుకుంది.. అఖండ మెజారిటీతో గెలిపించండి– కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, మేజర్ న్యూస్: శ్రీకాకుళం నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుందని, అదే బాధ్యతతో ప్రజలు తమ విలువైన ఓటును కూటమి అభ్యర్థులకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, లోకం మాధవి, వంశీకృష్ణ యాదవ్, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీకాకుళం నగరంలోని 57, 59, 60, 1, 2, 4, 5, 6, 7 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారని, అన్ని ఎన్నికల్లోనూ వన్‌సైడ్ విజయాన్ని అందించారని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అదే విజయపరంపరను శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కోరారు. నగర పరిధిలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలంటే కార్పొరేషన్‌లోనూ కూటమి నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. గత పాలకుల హయాంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటేనే కేసులు పెట్టే పరిస్థితులు ఉండేవని, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు చేరువైన ప్రజారంజక పాలన అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంపై దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని, ఇటీవల జరిగిన సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. కార్యకర్తల కష్టానికి తగిన గౌరవం కల్పిస్తూ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని, మరోవైపు 16 సంవత్సరాల పాటు ఎన్నికలను అడ్డుకుని నగర అభివృద్ధిని నిలిపివేసిన ఘనత గత పాలకులు, ఇతర రాజకీయ పక్షాలదని విమర్శించారు. అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి వేగంగా అడుగులు వేస్తుంటే, ఇతర రాజకీయ పక్షాలు అనవసర విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటింగ్ విషయంలో ప్రజలకు ఎలాంటి గందరగోళం ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. మేయర్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తుపై, ఆయా వార్డుల్లో కూటమి అభ్యర్థులకు కేటాయించిన గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గాజు గ్లాసు, సైకిల్ గుర్తులపై పోలైన ఓట్ల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా, గత ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఒక్క ఓటు ఎక్కువతోనైనా మొత్తం 60 వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యత సాధించాలని పిలుపునిచ్చారు. కాగా, కేంద్ర మంత్రి ఎన్నికల ప్రచారానికి ప్రతి వార్డులోనూ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతూ తమ మద్దతు, ఆశీర్వాదాలు అందించారు. ప్రజలు, కార్యకర్తలు ప్రచార రథం వెంట ఉత్సాహంగా నడుస్తూ కూటమి నాయకత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు.