ఓటు హక్కు గురించి ప్రశ్నించే అర్హత లేదు
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, నవంబర్ 22, మేజర్ న్యూస్
ఆమదాలవలస మున్సిపాలిటీలో కూటమి బలపరిచిన టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల ఓటు హక్కు గురించి ప్రశ్నించే అర్హత వైసీపీకి లేదని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలస టిడిపి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రమీల ఓటును సెప్టెంబర్ నెలలో ఫారం 8 ద్వారా నివాస మార్చుతున్నట్లు దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఆర్డినల్ రెసిడెన్షియల్ ద్వారా మున్సిపాలిటీలో ఓటు హక్కు పొందడం జరిగిందని తెలియజేశారు. ఒక నివాసంలో ఆరు నెలల పాటు ఉంటే ఓటు హక్కును మార్చుకొని వెసులుబాటు ప్రజాస్వామ్యం కల్పించిందని వివరించారు. వైసిపి ఓడిపోతుందన్న భయంతో లేనిపోని విమర్శలు చేసి, హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వార్డ్ మెంబర్ గా పోటీ చేయని వ్యక్తి తనను విమర్శించే అర్హత లేదన్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తిగా, చట్టాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందన్నారు. అర్ధరహితంగా మాట్లాడే వ్యక్తులపై పరువు నష్టం దావా కేసు వేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పలుమార్లు ప్రమీల పోటీ చేసి గెలుపొందారని, నేడు అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉన్నారని తెలిపారు. కూటమి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల ఆకర్షితులై ఘన విజయాన్ని అందజేస్తున్నారని, ఈ గెలుపును తట్టుకోలేక లేనిపోని విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. తనను ప్రశ్నించే అర్హత వైసీపీకి లేదని విమర్శించారు. కూటమి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.