పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు
సూర్య- బిక్కనూర్ పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లు నిలుస్తున్నాయని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో , రెండో విడతలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో కలిసి ఆదివారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని, ప్రతి పేదవాడి ఆత్మగౌరవానికి సొంత ఇల్లు ఒక ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజారెడ్డి ,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ,గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు,ఉప సర్పంచ్ గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి,వార్డు సభ్యులు ఒళ్లెపు శశికుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.