BREAKING
కూటమి ప్రభుత్వ అభ్యర్ధులను చిత్తుగా ఓడించండి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారం అందజేత బోధన శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసోత్సవాలు కార్తీక మాసంలో పోచంపాడ్ ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు నూతన చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ* ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ అదాలత్ లో రాజీ ఐతే ఇరు వర్గాలకు సమ న్యాయం --జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి. టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కీలకం పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పచ్చల నడుకుడలో ఎస్ఎస్సీ 1986-87 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కూటమి పార్టీల మద్దతుతో వార్డుల అభ్యర్థుల నామినేషన్... నరసన్నపేట, నవంబర్ 22 మేజర్ న్యూస్: నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. 10, 12, 13, 14, 17వ వార్డులకు చెందిన అభ్యర్థులు భారీ ప్రదర్ మెండోరా మండల అభివృద్ధికి రూ.2.85 కోట్ల నిధులు మంజూరు

చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కీలకం

Select Suryaa Now
చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కీలకం
సూర్య,భీమ్‌గల్చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెంపొందుతుందని బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. భీమ్‌గల్ పట్టణంలోని కృషి పాఠశాల ఆతిథ్యంలో నిర్వహిస్తున్న అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను, కష్టనష్టాలను సమతుల్యంగా ఎదుర్కొనే మనోనిబ్బరం కేవలం క్రీడల ద్వారానే అలవడుతుందని తెలిపారు. ఆటల్లో పాల్గొనడం వల్ల ఒత్తిడిని జయించే మానసిక పరిపక్వత లభిస్తుందన్నారు.ప్రస్తుత రోజుల్లో పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, వీడియో గేమ్‌లకు బానిసలవుతుండటం పట్ల ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్లు, టీవీల వినియోగం వల్ల పిల్లలపై దుష్పరిణామాలు కలుగుతాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను వాటికి దూరంగా ఉంచాలని కోరారు. ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు పిల్లలు క్రీడా మైదానంలో ఆడుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.తనలో సగం క్రీడాస్ఫూర్తి (స్పోర్ట్స్‌మ్యాన్ స్పిరిట్) ప్రవహిస్తుందని, అనివార్య కారణాల వల్ల టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి రాలేకపోయినప్పటికీ, నిర్వాహకుల ఆహ్వానం మేరకు బిజీ షెడ్యూల్‌లోనూ క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు విచ్చేశానని తెలిపారు. క్రీడల అభివృద్ధికి, పోటీల నిర్వహణకు ఒక శాసనసభ్యుడిగా మాత్రమే కాకుండా, ఒక క్రీడాకారుడిగా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.టోర్నమెంట్‌లో పాల్గొంటున్న చిన్నారులకు ఆశీస్సులు అందిస్తూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, పోటీల్లో భాగస్వామ్యం కావడమే ఒక గొప్ప విజయమని ప్రశాంత్ రెడ్డి అన్నారు. విజయం సాధించిన వారు ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు, ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా తదుపరి పోటీల్లో గెలిచేందుకు కఠోర సాధన చేయాలని పిలుపునిచ్చారు.క్రీడల పట్ల ఉన్న మక్కువతో ఖర్చుకు వెనుకాడకుండా మండల స్థాయి క్రీడా పోటీలకు ఆతిథ్యమిస్తున్న కృషి పాఠశాల ఫౌండర్ వేముల రవీందర్ రెడ్డి, అజిత్ రెడ్డి మరియు పాఠశాల యాజమాన్యాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. గతంలో తన తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి కలిసి వేల్పూరులో వివిధ క్రీడలు ఆడేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గంలో క్రీడలను సజీవంగా ఉంచుతూ, టోర్నమెంట్‌ను విజయవంతంగా నడిపిస్తున్న పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయ) సోదరీసోదరులు, విద్యాసాగర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమణ మరియు ఎంఈఓలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కృషి పాఠశాల ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.