BREAKING
పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం మెడికోల సమస్య పరిష్కారానికి కేటీఆర్ చొరవ అద్దంకి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవిపై సర్దుబాటు. తొలి రెండేళ్లు సాంబశివరావు, తర్వాత మూడేళ్లు మానస. రాయల్ కింగ్స్ క్రికెట్ జట్టుకు అక్షర యాజమాన్యం జెర్సీల ప్రధానం. కూటమి ప్రభుత్వ అభ్యర్ధులను చిత్తుగా ఓడించండి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారం అందజేత బోధన శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసోత్సవాలు కార్తీక మాసంలో పోచంపాడ్ ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు నూతన చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ* ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు

Select Suryaa Now
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు
 
సూర్య. బీర్కూర్ ;;ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. రైతునగర్ గ్రామానికి చెందిన గంగ కొటేశ్వరి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో విషాదంలో ఉన్న ఆమె కుటుంబానికి  విశ్రాంత ఉపాధ్యాయుడు మేకల విట్టల్, ఉపాధ్యాయుడు హనుమాన్లు చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు.1994–95 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు, గురువులు కలిసి రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి తమ వంతు సహాయం అందించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు చూపిన మానవీయ సేవాభావాన్ని పలువురు అభినందించారు. విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ సామాజిక బాధ్యతను చాటుకోవడం ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు విజయ్ జేట్టి, చైతన్య, కృష్ణమూర్తి, సాయిలు, సంగమేశ్వర్, గోపాల్ జెట్టి తదితరులు పాల్గొన్నారు.