telangana
కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్
సూర్య, హుజురాబాద్:జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో హుజురాబాద్ పట్టణానికి చెందిన జిఎస్ కేడిఐ కరాటే
అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు బంగారు పతకాలు సాధించారని కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ అన్నారు. ఆదివారం జరిగిన కరాటే పోటీలలో బ్లాక్ బెల్ట్ కేటగిరీలో ఎస్.కె షాదుల్లా బాబా గోల్డ్ మెడల్, కటాస్ విభాగంలో ఎం. భాను తేజ గోల్డ్ మెడల్, ఆల్ కలర్ బెల్ట్ కటాస్ లో పి. సహస్ర గోల్డ్ మెడల్, కటాస్ విభాగంలో సిహెచ్. సాయి అనుకృత గోల్డ్ మెడల్, పినిస్సి కటాస్ లో పి. నిస్సి గోల్డ్ మెడల్, పి. కిరణ్ మై గోల్డ్ మెడల్, ఎండి. ఉమేరా తస్లీమ్ కటాస్ లో గోల్డ్ మెడల్, ఎంఏ. అమన్ ఆల్ కలర్ బెల్ట్ లో కటాస్ లో గోల్డ్ మెడల్, ఎల్లో బెల్ట్, ఎండి. జరసిద్దియా కటాస్ లో గోల్డ్ మెడల్, ఎండి. మహిన్, ఎండి నాదేరాలు సిల్వర్ మెడల్స్ సాధించారని ఆయన తెలిపారు. కరాటే లో గోల్డ్ సిల్వర్ మెడల్స్ రావడం పట్ల పలువురు క్రీడాభిమానులు పిల్లలను అభినందించారు.