BREAKING
ఇంటి తాళం తెరిచి చోరీ.. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదు పసుపులేటి ఉషా కిరణ్. నందిగాం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు 11వ వార్డు లో బీచ్ రోడ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సినీనటి శిల్పా శెట్టి కార్పొరేటర్లు ను సన్మానించిన గ్రామ ప్రజలు పద్మనాభం కూటమిలో ముసలం.. పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం మెడికోల సమస్య పరిష్కారానికి కేటీఆర్ చొరవ అద్దంకి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవిపై సర్దుబాటు. తొలి రెండేళ్లు సాంబశివరావు, తర్వాత మూడేళ్లు మానస. రాయల్ కింగ్స్ క్రికెట్ జట్టుకు అక్షర యాజమాన్యం జెర్సీల ప్రధానం. కూటమి ప్రభుత్వ అభ్యర్ధులను చిత్తుగా ఓడించండి

పద్మనాభం కూటమిలో ముసలం..

Select Suryaa Now
పద్మనాభం కూటమిలో ముసలం..

బి ఆర్ తాళ్లవలస కూటమిలో చిచ్చు

పద్మనాభంలో రాజకీయ భూకంపం

జనసైనికులకు టీడీపీ నేత బెదిరింపులు

జెడ్పీటీసీ తీరుపై జనసేన భీమిలి ఇన్‌ఛార్జ్ పంచకర్ల సందీప్ తీవ్ర ఆరోపణలు

పద్మనాభం నుంచి మొదలైన మంట భీమిలి మొత్తం వ్యాపిస్తోంది

భారీగా మొహరించిన పోలీసులు.

పద్మనాభం, నవంబర్ 22, మేజర్ న్యూస్:

భీమిలి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఇదో సంచలన ఘట్టం... కూటమి గెలుపు కోసం భుజం భుజం కలిపి, చెమటోడ్చి, రక్తం చిందించి నడిచిన టీడీపీ - జనసేన మధ్య ఇప్పుడు పద్మనాభం మండలం వేదికగా బహిరంగ యుద్ధమే మొదలైంది.
ఇన్నాళ్లూ లోపల లోపల రగులుతున్న అసంతృప్తి ఇప్పుడు బహిరంగంగా బద్దలైంది. పద్మనాభం మండలంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ స్థానాల పంపకాల వ్యవహారమే ఈ చిచ్చుకు కారణమైంది.

సందీప్ సంచలన ఆరోపణలు..!!

పద్మనాభం మండల టీడీపీ జెడ్పీటీసీ కోరాడ రమణ తీరుపై జనసేన భీమిలి ఇన్‌ఛార్జ్ డా. పంచకర్ల సందీప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాటలు ఇప్పుడు నియోజకవర్గం మొత్తంలో మారుమోగుతున్నాయి.
"కూటమి కోసం రక్తం చిందించి, ప్రాణాలకు తెగించి పనిచేసిన జనసైనికులకు దక్కుతున్న గౌరవం ఇదేనా?" కూటమి కోసం కష్టపడిన జనసైనికులకు అవమానాలు, బెదిరింపులే బహుమతిగా ఇస్తే.. కూటమి ఐక్యత ఎలా సాధ్యమవుతుంది?
"వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలు పంచుకోవడం తప్పని, హుందాగా పోటీ చేద్దామని కోరితే చెప్పుతో కొడతానంటూ దూషణలు చేస్తున్నారు." పోటీ చేస్తామంటే జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇదేనా కూటమి ధర్మం? ఇదేనా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఐక్యత? జనసేన అంటే బలహీనం కాదు. మేము కూటమి ధర్మం పాటిస్తున్నాం కాబట్టే మౌనంగా ఉన్నాం. మౌనాన్ని బలహీనతగా భావించవద్దు. సందీప్ వ్యాఖ్యలు ఇప్పుడు భీమిలి నియోజకవర్గం మొత్తంలో దావానంలా వ్యాపించాయి. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అసలు వివాదం ఏంటి? -

పద్మనాభం మండలం బి ఆర్ తాళ్లవలస పంచాయతీ వార్డు నెంబర్ స్థానాల పంపకంలో జనసేనకు తగిన ప్రాధాన్యం దక్కలేదని జనసైనికుల ఆవేదన. కూటమి ధర్మం ప్రకారం అందరినీ కలుపుకుని పోవాల్సిన చోట, ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణ.
వైసీపీతో సర్దుబాటు చేసుకుని స్థానాలు పంచుకుంటున్నారన్న ఆరోపణే ఇప్పుడు అత్యంత సంచలనంగా మారింది. కూటమి పుట్టుకే వైసీపీని ఓడించడానికి. అలాంటిది వైసీపీతోనే సర్దుబాటా? అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. హుందాగా పోటీ చేద్దామని అడిగితే బెదిరింపులా? అని నిలదీస్తున్నారు.

పద్మనాభంలో జనసైనికుల ఆగ్రహ జ్వాల..!!

సందీప్ వ్యాఖ్యల తర్వాత పద్మనాభం మండలంలో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గ్రామ గ్రామానా ఈ విషయంపై చర్చ జరుగుతోంది. టీ కొట్ల దగ్గర, గ్రామ కూడళ్లలో, వాట్సాప్ గ్రూపుల్లో ఇదే హాట్ టాపిక్. "మేము కూటమి కోసం పని చేశాం, కానీ మాకు గౌరవం లేదా?" అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలప్పుడు మా అవసరం గుర్తొచ్చింది, ఇప్పుడు మమ్మల్నే బెదిరిస్తారా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో జనసైనికులు సమావేశాలు పెట్టుకుని తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.

టీడీపీ శ్రేణుల్లోనూ కలకలం - ఏం జరుగుతోంది?

ఈ వ్యవహారం టీడీపీ శ్రేణుల్లోనూ కలకలం రేపింది. కూటమిలో విభేదాలు బయటకు రావడం పార్టీకి నష్టం కలిగిస్తుందని పలువురు టీడీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ ఆరోపణలపై కోరాడ రమణ ఎలా స్పందిస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలపై ప్రభావం పడుతుందా?

ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన కూటమి నేతలు ఇప్పుడు ఇలా బహిరంగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
వైసీపీతో సర్దుబాటు ఆరోపణలు, బెదిరింపుల ఆరోపణలు - ఈ రెండు అంశాలు ఇప్పుడు కూటమిలో పెద్ద చర్చకు దారి తీశాయి. రానున్న పంచాయతీ ఎన్నికల వేళ ఈ చిచ్చు కూటమికి ఎంత నష్టం చేస్తుంది? కూటమి ఓటు బ్యాంకు చీలుతుందా? వైసీపీకి ఇది లాభం చేస్తుందా? అనే ప్రశ్నలు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్నాయి.

బి ఆర్ తాళ్లవలసలో ఉద్రిక్తత - భారీగా మొహరించిన పోలీసులు..!!

బి ఆర్ తాళ్లవలస పంచాయతీ వార్డు స్థానాల వివాదం నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామంలోకి చేరుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బి ఆర్ తాళ్లవలస గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. గ్రామ ప్రధాన కూడళ్లలో, పంచాయతీ కార్యాలయం వద్ద, కీలక ప్రాంతాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు, గస్తీ ముమ్మరం చేశారు.ఇరు వర్గాల నేతలతో పోలీసులు మాట్లాడి శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. గ్రామంలో ప్రస్తుతం పోలీసుల పహారా కొనసాగుతోంది.

అధిష్ఠానం ఏం చేస్తుంది? - అందరి చూపు అటువైపే..!!

ఈ వివాదంపై కూటమి అధిష్ఠానం ఎలా స్పందిస్తుంది? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. టీడీపీ అధినాయకత్వం, జనసేన అధినాయకత్వం జోక్యం చేసుకుని ఇరు వర్గాలను కూర్చోబెట్టి సర్దుబాటు చేస్తారా? లేక వివాదం మరింత ముదురుతుందా? భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఈ విషయంలో జోక్యం చేసుకుని సర్దుబాటు చేస్తారా? అని కూటమి శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.
జనసైనికుల ఆవేదనకు సమాధానం ఏమిటి? బెదిరింపుల ఆరోపణలపై విచారణ జరుగుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పద్మనాభం వివాదం ఇక్కడితో ఆగదని స్థానికులు చర్చించుకుంటున్నారు.