11వ వార్డు లో బీచ్ రోడ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సినీనటి శిల్పా శెట్టి
సాగర్ నగర్, మేజర్ న్యూస్: జీవీఎంసీ 11వ వార్డు పరిధి లో బీచ్ రోడ్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని ఆదివారం ఉదయం సినీనటి శిల్పా శెట్టి దర్శించుకున్నారు అలాగే ఈ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన శిల్పా శెట్టి కి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు అనంతరం ఆమెకు స్వామివారి నీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ పండితులు ఆమెకు వేద పండితులు ఆశీర్వాదం చేశారు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ విషయం తెలుసుకున్న భక్తులు అభిమానులు ఆమెకు చూసేందుకు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు ఆమెతోపాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు