BREAKING
అంకిశెట్టిపల్లి సర్పంచ్ బరిలో కొప్పల వెంకటరమణ : స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు అలుపెరగని ప్రజాసేవకుడికి పట్టాభిషేకం - శ్రీరామ్ చినబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేద్దాం - తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి పిలుపు బోని గ్రామంలో కూటమి నేతల ఆత్మీయ కలయిక గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృష్ణవేణి అడుగులు ఇంటి తాళం తెరిచి చోరీ.. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదు పసుపులేటి ఉషా కిరణ్. నందిగాం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు 11వ వార్డు లో బీచ్ రోడ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సినీనటి శిల్పా శెట్టి కార్పొరేటర్లు ను సన్మానించిన గ్రామ ప్రజలు పద్మనాభం కూటమిలో ముసలం.. పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం

బోని గ్రామంలో కూటమి నేతల ఆత్మీయ కలయిక

Select Suryaa Now
బోని గ్రామంలో కూటమి నేతల ఆత్మీయ కలయిక

సర్పంచ్ అభ్యర్థి సూరాల సత్య వరప్రసాద్ రావు, ఎంపీపీ తాట్రాజు అప్పారావు కలయిక..!

ఆనందపురం, మేజర్ న్యూస్ :  బోని గ్రామంలో కూటమి నేతల ఆత్మీయ కలయిక చోటుచేసుకుంది. బోని గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సూరాల సత్య వరప్రసాద్ రావు ని ఆనందపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తాట్రాజు అప్పారావు ఆత్మీయంగా కలిశారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరువురు నేతలు ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడారు. గ్రామంలో కూటమి బలం, పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. బోని గ్రామంలో కూటమి అభ్యర్థి సూరాల సత్య వరప్రసాద్ రావు విజయం కోసం అందరూ సమన్వయంతో, ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగింది. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, గ్రామ స్థాయిలో కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తామని నాయకులు తెలిపారు.
సూరాల వరప్రసాద్ రావు తో పాటు ఏడుగురు వార్డు మెంబర్లు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా గ్రామంలో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ కార్యక్రమంలో బోని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కూటమి నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశం గ్రామంలో కూటమి ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.