BREAKING
అంకిశెట్టిపల్లి సర్పంచ్ బరిలో కొప్పల వెంకటరమణ : స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు అలుపెరగని ప్రజాసేవకుడికి పట్టాభిషేకం - శ్రీరామ్ చినబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేద్దాం - తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి పిలుపు బోని గ్రామంలో కూటమి నేతల ఆత్మీయ కలయిక గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృష్ణవేణి అడుగులు ఇంటి తాళం తెరిచి చోరీ.. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదు పసుపులేటి ఉషా కిరణ్. నందిగాం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు 11వ వార్డు లో బీచ్ రోడ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సినీనటి శిల్పా శెట్టి కార్పొరేటర్లు ను సన్మానించిన గ్రామ ప్రజలు పద్మనాభం కూటమిలో ముసలం.. పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం

అలుపెరగని ప్రజాసేవకుడికి పట్టాభిషేకం - శ్రీరామ్ చినబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేద్దాం - తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి పిలుపు

Select Suryaa Now
అలుపెరగని ప్రజాసేవకుడికి పట్టాభిషేకం - శ్రీరామ్ చినబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేద్దాం - తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి పిలుపు

 

మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : తన రాజకీయ ప్రస్థానంలో అలుపెరుగని ప్రజా సేవకుడు మదనపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైందని,రేపు అనగా సోమవారం పండుగ వాతావరణం జరిగే చైర్మన్ శ్రీరామ్ చినబాబు,కూటమి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి మునిసిపల్ కార్యాలయం ముస్తాబైందని తెలుగుదేశం పార్టీ యువనేత,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి (షో ఆఫ్ శీనా) పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ చేనేత కుటుంబ నుండి రాజకీయాల్లో ప్రవేశించి,ఎటువంటి మద్ధతు లేకుండా స్వశక్తితో తెలుగు యుత రాష్ట్ర అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసి తానేమిటో నిరూపించుకున్న వ్యక్తి శ్రీరామ్ చినబాబు అన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ బాబు,జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆశీస్సులతో మదనపల్లి మునిసిపల్ చైర్మన్ పీఠం అధిరోహించడం శుభ సూచకమన్నారు.గత వైసిపి ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు బనాయించినప్పటికీ మొక్కువోని విశ్వాసంతో ఆ పార్టీ దౌర్జన్యాలు,అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడటమే కాకుండా,టిడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారనడంలో అతిశయోక్తి లేదన్నారు.ఆయన చురుకుతనమే పార్టీలో మాస్,డైనమిక్ నాయకుడిగా గుర్తింపు తీసుకొచ్చాయన్నారు.పార్టీ నాయకులు,కార్యకర్తలకు కష్టమొస్తే క్షణమైన ఆలోచించకుండా స్పందించే నాయకత్వ పటిమ ఆయన సొంతం.ఆయన ప్రమాణ స్వీకారం చేసే అద్భుత ఘట్టం కోసం,పార్టీ శ్రేణులతోపాటు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని నాగూర్ వలి భావోద్వేగంతో తెలిపారు.జిల్లా నలుమూలల నుండి కూటమి నాయకులు,కార్యకర్తలు తరలివచ్చి బీసీ ముద్దుబిడ్డ పట్టాభిషేకాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి