BREAKING
అంకిశెట్టిపల్లి సర్పంచ్ బరిలో కొప్పల వెంకటరమణ : స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు అలుపెరగని ప్రజాసేవకుడికి పట్టాభిషేకం - శ్రీరామ్ చినబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేద్దాం - తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి పిలుపు బోని గ్రామంలో కూటమి నేతల ఆత్మీయ కలయిక గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృష్ణవేణి అడుగులు ఇంటి తాళం తెరిచి చోరీ.. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదు పసుపులేటి ఉషా కిరణ్. నందిగాం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు 11వ వార్డు లో బీచ్ రోడ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సినీనటి శిల్పా శెట్టి కార్పొరేటర్లు ను సన్మానించిన గ్రామ ప్రజలు పద్మనాభం కూటమిలో ముసలం.. పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం

ఇంటి తాళం తెరిచి చోరీ.. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్

Select Suryaa Now
ఇంటి తాళం తెరిచి చోరీ.. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్

21.70 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,500 నగదు స్వాధీనం

​వివరాలు వెల్లడించిన క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ వెంకట్రావు

గాజువాక, మేజర్ న్యూస్ : ఇంట్లో ఎవరూ లేని సమయంలో కరెంట్ మీటర్‌పై ఉంచిన తాళం చెవులతో తలుపులు తెరిచి, బీరువా పగులగొట్టి చోరీకి పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ సిటీ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు వివరాలను వెల్లడించారు. తిరుపతికి చెందిన చందక మణికంఠ అలియాస్ శ్రీకాంత్ (29), బదురు వాసు (32) ఈ నెల 12న మధ్యాహ్నం గాజువాక శ్రీనగర్‌లో తాళం వేసి ఉన్న ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. బయట వాసు కాపలా ఉండగా, మీటర్‌పై ఉన్న తాళాలతో మణికంఠ లోపలికి ప్రవేశించి ఇనుప రాడ్డుతో బీరువా పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరించాడని చెప్పారు. చోరీ సొత్తులోని ఓ బంగారు గొలుసును తమిళనాడు రాష్ట్రం గుమ్మిడిపూండికి చెందిన మునికృష్ణ బి.ఆర్. (40) సాయంతో బజాజ్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.1,52,069 రుణం పొంది ముగ్గురూ పంచుకున్నట్లు తెలిపారు. ఆదివారం గాజువాక బీసీ రోడ్డులోని బంగారు దుకాణాల వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని గాజువాక క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం బయటపడిందన్నారు. నిందితుల నుంచి 16.97 గ్రాముల బంగారు మిరియాల తాడు, 2.84 గ్రాముల చెవి దిద్దులు, 1.89 గ్రాముల మూడు బంగారు కాసులు (మొత్తం 21.70 గ్రాముల బంగారం), రూ.2,500 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ప్రజలు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తాళం చెవులను ఇంటి బయట ఉంచవద్దని ఏసీపీ వెంకట్రావు సూచించారు.