BREAKING
అంకిశెట్టిపల్లి సర్పంచ్ బరిలో కొప్పల వెంకటరమణ : స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు అలుపెరగని ప్రజాసేవకుడికి పట్టాభిషేకం - శ్రీరామ్ చినబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేద్దాం - తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి పిలుపు బోని గ్రామంలో కూటమి నేతల ఆత్మీయ కలయిక గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృష్ణవేణి అడుగులు ఇంటి తాళం తెరిచి చోరీ.. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదు పసుపులేటి ఉషా కిరణ్. నందిగాం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు 11వ వార్డు లో బీచ్ రోడ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సినీనటి శిల్పా శెట్టి కార్పొరేటర్లు ను సన్మానించిన గ్రామ ప్రజలు పద్మనాభం కూటమిలో ముసలం.. పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం

నందిగాం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు

Select Suryaa Now
నందిగాం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు

* ప్రజాసేవే లక్ష్యం.. గ్రామ ప్రగతే ధ్యేయం..

భోగాపురం, (మేజర్ న్యూస్): నందిగాం గ్రామ సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలనే సంకల్పంతో గరి వెంకటరమణ గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చారు. స్వర్గీయ గరి చిన్నఅప్పలస్వామి నాయడు గారు కుటుంబీకులు గతంలో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లు గా సేవలు అందించి ఉన్నారు. అనేక రకాలుగా ప్రజలకు సేవలు అందించి ఉన్నారు.స్వర్గీయ గరి వెంకటరమణ గారు, శ్రీమతి సింహాద్రమ్మ దంపతుల కుమారుడైన గరి వెంకటరమణ గారు M.A., B.Ed. విద్యార్హతలు కలిగి ఉన్నారు. సుమారుగా ప్రైవేట్ విద్యా సంస్థ స్థాపించి సుమారుగా 25సంవత్సరాలు పాటు గ్రామీణ ప్రజలకి నాణ్యమైన విద్యను అందించి ఎంతో మంది విద్యార్థులను డాక్టర్స్, ఇంజనీర్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దారు.. విద్య తో పాటు సామాజిక బాధ్యత, ప్రజాసేవ పట్ల ఆసక్తిని కలిగి, గ్రామ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందారు. స్వర్గీయలు గరి దాసుడు తాత గారి కుమారులు అయిన గరి కన్నబాబు(ప్రకాష్ రావు )గారి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం మరియు సహకారంతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలనే సంకల్పంతో ఉన్నారు.గతం నుండి కన్నబాబు గారు రాజకీయ నేపథ్యం కలిగి ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎల్లప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి సహాయపడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవిస్తూ, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, వారి సమస్యలను తన సమస్యలుగా భావించే మనస్తత్వం ఆయనది. గ్రామ అభివృద్ధి అనేది కేవలం హామీలకే పరిమితం కాకుండా ఆచరణలో కనిపించాలన్నది ఆయన ప్రధాన ఆకాంక్ష. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణ, రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నారు. అలాగే యువతకు ప్రోత్సాహం, విద్యార్థుల అభ్యున్నతి, మహిళల సంక్షేమం, వృద్ధుల సంక్షేమం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలనే ఆలోచనతో ఉన్నారు. నందిగాం గ్రామానికి ఒక స్పష్టమైన అభివృద్ధి దిశ, భవిష్యత్తుకు ఒక బలమైన ప్రణాళిక ఉండాలన్నదే ఆయన విజన్. గ్రామంలోని ప్రతి వీధి అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందాలి, యువతకు మంచి అవకాశాలు కలగాలి, గ్రామం పరిశుభ్రంగా, సుందరంగా, ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవాలి అనేది ఆయన ఆకాంక్ష. ప్రజల సహకారం, పెద్దల ఆశీస్సులు, యువత మద్దతుతో నందిగాం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు గరి వెంకటరమణ గారు మరియు గరి కన్నబాబు గారు ఉమ్మడిగా కృషి చేయాలని సంకల్పించారు. పదవి కోసం కాదు.. ప్రజాసేవ కోసం.. హామీల కోసం కాదు.. గ్రామ అభివృద్ధి కోసం.. నందిగాం గ్రామ ఉజ్వల భవిష్యత్తు కోసం గరి వెంకటరమణ గారి ముందడుగు.

 రిపోర్టర్: వై.శ్రీనివాస్, భోగాపురం.