BREAKING
కార్పొరేటర్లు ను సన్మానించిన గ్రామ ప్రజలు పద్మనాభం కూటమిలో ముసలం.. పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం మెడికోల సమస్య పరిష్కారానికి కేటీఆర్ చొరవ అద్దంకి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవిపై సర్దుబాటు. తొలి రెండేళ్లు సాంబశివరావు, తర్వాత మూడేళ్లు మానస. రాయల్ కింగ్స్ క్రికెట్ జట్టుకు అక్షర యాజమాన్యం జెర్సీల ప్రధానం. కూటమి ప్రభుత్వ అభ్యర్ధులను చిత్తుగా ఓడించండి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారం అందజేత బోధన శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసోత్సవాలు కార్తీక మాసంలో పోచంపాడ్ ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు

మెడికోల సమస్య పరిష్కారానికి కేటీఆర్ చొరవ

Select Suryaa Now
మెడికోల సమస్య పరిష్కారానికి కేటీఆర్ చొరవ
సూర్య కరీంనగర్ 
 
సొంత కళాశాల భవనం, మౌలిక వసతులు కల్పించాలంటూ ఆందోళన చేస్తున్న కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చొరవ చూపారు. కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కుమార్తె వివాహ వేడుకకు వెళ్తున్న క్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నా చేస్తుండటాన్ని గమనించిన ఆయన తన వాహనాన్ని ఆపి నేరుగా విద్యార్థుల వద్దకు వెళ్లారు. వారి ఆందోళనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు సొంత భవనం లేకపోవడం, కనీస మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడం, నూతన భవన నిర్మాణం పూర్తయినప్పటికీ అప్పగించడంలో జరుగుతున్న జాప్యం తదితర సమస్యలను విద్యార్థులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
 
విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న కేటీఆర్ అప్పటికప్పుడు స్పందించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఫోన్ చేసి కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. నూతన కళాశాల భవనాన్ని త్వరితగతిన విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. విద్యార్థుల సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సానుకూలత వ్యక్తం చేయడంతో ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసింది.
 
విద్యార్థుల ఆందోళనకు స్పందన
 
కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు గత కొంతకాలంగా సొంత భవనం, హాస్టల్ వసతి, తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రయోగశాలలు, రవాణా వంటి మౌలిక సదుపాయాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన కళాశాల భవనం నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయినా మిగిలిన పనులు పూర్తి చేసి అప్పగించడంలో జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అటుగా వెళ్తున్న కేటీఆర్ విద్యార్థుల ధర్నాను గమనించి స్వయంగా వారి వద్దకు చేరుకుని సమస్యలు తెలుసుకోవడం, సంబంధిత మంత్రితో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపడం విద్యార్థుల్లో ఆశలు రేకెత్తించింది. ప్రభుత్వం త్వరితగతిన స్పందించి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ఇక్కడ వీరి వెంట మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశికిరెడ్డి , పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.