BREAKING
పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం మెడికోల సమస్య పరిష్కారానికి కేటీఆర్ చొరవ అద్దంకి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవిపై సర్దుబాటు. తొలి రెండేళ్లు సాంబశివరావు, తర్వాత మూడేళ్లు మానస. రాయల్ కింగ్స్ క్రికెట్ జట్టుకు అక్షర యాజమాన్యం జెర్సీల ప్రధానం. కూటమి ప్రభుత్వ అభ్యర్ధులను చిత్తుగా ఓడించండి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారం అందజేత బోధన శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసోత్సవాలు కార్తీక మాసంలో పోచంపాడ్ ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు నూతన చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ* ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ

జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారం అందజేత

Select Suryaa Now
జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారం అందజేత
సూర్య వేల్పూరు ;చదువులో ప్రతిభ కనబరిచి వేల్పూర్ మండల మోతే గ్రామానికి చెందిన జువ్వి ఆశిష్ జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారానికి ఎంపికై గ్రామానికి, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచాడు. పదో తరగతి పరీక్షల్లో 530 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు.చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం, నిజామాబాద్ జిల్లా, శ్రీరంగం లక్ష్మమ్మ ఛారిటబుల్ ట్రస్ట్, అన్నారం వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆశిష్‌కు ఈ గౌరవం దక్కింది. 2025-2026 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించే క్రమంలో ఆశిష్‌ను పురస్కారానికి ఎంపిక చేశారు.ప్రస్తుతం ఆశిష్ హాస్టల్‌లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న నేపథ్యంలో అతని తరఫున తండ్రి జువ్వి హరీష్ పురస్కారాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా ఆశిష్ తండ్రి హరీష్ మాట్లాడుతూ తన కుమారుడి కృషి, పట్టుదలను గుర్తించి జిల్లా స్థాయి పురస్కారంతో సత్కరించడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ, వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించేలా ప్రోత్సహిస్తున్న చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం, శ్రీరంగం లక్ష్మమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభించడం మరింత ఉన్నతంగా రాణించేందుకు స్ఫూర్తినిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య స్వామి, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, శ్రీరంగం లక్ష్మమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ధర్మగడ్డ జయరాజు, మానకొండూర్‌కు చెందిన కొండూరు రవికుమార్, సిద్ధులగుట్ట ఆలయ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.