BREAKING
పద్మనాభం కూటమిలో ముసలం.. పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం మెడికోల సమస్య పరిష్కారానికి కేటీఆర్ చొరవ అద్దంకి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవిపై సర్దుబాటు. తొలి రెండేళ్లు సాంబశివరావు, తర్వాత మూడేళ్లు మానస. రాయల్ కింగ్స్ క్రికెట్ జట్టుకు అక్షర యాజమాన్యం జెర్సీల ప్రధానం. కూటమి ప్రభుత్వ అభ్యర్ధులను చిత్తుగా ఓడించండి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారం అందజేత బోధన శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసోత్సవాలు కార్తీక మాసంలో పోచంపాడ్ ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు నూతన చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ*

కూటమి ప్రభుత్వ అభ్యర్ధులను చిత్తుగా ఓడించండి

Select Suryaa Now
కూటమి ప్రభుత్వ అభ్యర్ధులను చిత్తుగా ఓడించండి

అరకులోయ, మేజర్ న్యూస్:  తూర్పు కనుమల్లోని కొండలు,గుట్టల్లో నిక్షిప్తమై ఉన్న అపారమైన బాక్సైట్ నిక్షేపాల వెలికితీతకు సన్నద్ధం చేస్తున్న కూటమి ప్రభుత్వం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని రాష్ట్ర ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి కిల్లో.సురేంద్ర పిలుపునిచ్చారు.స్థానిక గిరిజన సంఘం కార్యాలయ భవనంలో ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడుతూ అమాయక ఆదివాసీ గిరిజనుల మనుగడకు ముప్పు తెచ్చిపెడుతున్న తెలుగుదేశం,బిజెపి, జనసేన పార్టీల ప్రోత్సాహంతో ఎన్నికల బరిలో దిగిన సర్పంచ్ అభ్యర్థులను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 
బాక్సైట్ ఖనిజ సంపద తవ్వకాలకు వ్యతిరేకంగా, జీవో నంబర్ 3 చట్టబద్ధతకు,హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతూ
1/70 చట్టం పరిరక్షణకు నిరంతరం పోరు బాటపడుతున్న సిపిఎం వామపక్ష పార్టీలు బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థులకు మాత్రమే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల గనులశాఖ సమీక్షా సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని, జర్రెల,సప్పర్ల,గాలికొండ,రక్త కొండ,చిట్టంగొంది ప్రాంతాల్లో  నిల్వ ఉన్న సుమారు 650 మిలియన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాలను త్రవ్వకాలు జరిపి 2027,2028 ఆర్థిక సంవత్సరంలో 5700 కోట్ల రూపాయలు ఖజానా నింపుకోవాలంటూ చెప్పారని ఆయన తెలిపారు.ఈ ఆలోచనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు.భూములు, జలసిరులు,పర్యావరణం, ఆదివాసీల సంస్కృతిని సర్వనాశనం చేసే బాక్సైట్ వెలిగితే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించాలని కిల్లో. సురేంద్ర డిమాండ్ చేశారు.
బాక్సైట్ తవ్వకాలు జరిపితే 5 వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసులకు రాజ్యంగం కల్పించిన హక్కులకు,ఆదివాసుల అస్తిత్వానికి తీవ్రంగా భంగం కలుగుతుందన్నారు.
వందలాది గిరిజన గ్రామాలు,వేలమంది గిరిజన ప్రజలు నిర్వాసితులు అవుతారని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలో బాక్సైట్ తవ్వకాల జోలికి వెళ్ళబోమని మాట ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 వ షెడ్యూల్ ప్రాంతంలో అపారమైన  సహజవనరులను కార్పొరేట్ సంస్థలకు అమ్మకాలకు పెడుతున్న  టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీ సర్పంచులను ఈఎన్నికల్లో తప్పనిసరిగా ఓడించి తీరాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి  కిల్లో.సురేంద్ర విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం కార్యనిర్వహక సభ్యులు పాల్గొన్నారు.