కూటమి పార్టీల మద్దతుతో వార్డుల అభ్యర్థుల నామినేషన్... నరసన్నపేట, నవంబర్ 22 మేజర్ న్యూస్: నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. 10, 12, 13, 14, 17వ వార్డులకు చెందిన అభ్యర్థులు భారీ ప్రదర్
నరసన్నపేట, మేజర్ న్యూస్:
నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. 10, 12, 13, 14, 17వ వార్డులకు చెందిన అభ్యర్థులు భారీ ప్రదర్శనగా నామినేషన్ కేంద్రానికి తరలివెళ్లారు.
శివనగర్ కాలనీలోని అమ్మవారి ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ కూటమి పార్టీల జెండాలు, పసుపు తోరణాలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కేరింతలు, నినాదాలతో అభ్యర్థులకు మద్దతు పలికారు. వార్డుల పరిధిలోని వీధులన్నీ పసుపుమయంగా మారడంతో సందడి నెలకొంది. 10వ వార్డు అభ్యర్థిగా మొయ్యి హరికిషన్, 12వ వార్డు అభ్యర్థిగా వాన రామకుమారి రాంబాబు, 13వ వార్డు అభ్యర్థిగా బగ్గు రవికుమార్, 14వ వార్డు అభ్యర్థిగా రావాడ గణపతిరావు, 17వ వార్డు అభ్యర్థిగా సాసుపల్లి కృష్ణబాబు, బోయిన మాధవి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారాయణదాసు కు నామినేషన్లు దాఖలు చేశారు.
డిసెంబర్ 2న జరగనున్న నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు అభ్యర్థులకు మద్దతుగా పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో నామినేషన్ కార్యక్రమం సందడిగా సాగింది. మేజర్ పంచాయతీ అభివృద్ధికి తమను గెలిపించాలని వారి విజ్ఞప్తి చేశారు.