telangana
పచ్చల నడుకుడలో శ్రీశ్రీశ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు
సూర్య వేల్పూరు వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ మంగళవారం నుంచి 28వ తేదీ శనివారం వరకు ఐదు రోజుల పాటు ఈ మహోత్సవాలు జరగనున్నాయి.ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు, అభిషేకాలు, కలశ స్థాపన, విగ్రహ ప్రతిష్ఠాపన కుంకుమార్చన ధ్వజారోహణము తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇట్టి కార్యక్రమాలు పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ముఖ్యంగా 25, 26, 27, 28 తేదీల్లో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించనున్నారు. మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.ఈ మహోత్సవాలను విజయవంతం చేసేందుకు గ్రామ కమిటీ, గ్రామ ప్రముఖులు, గ్రామ ప్రజలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.కావున భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ మల్లన్న స్వామి వారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.