అదాలత్ లో రాజీ ఐతే ఇరు వర్గాలకు సమ న్యాయం --జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి.
కొత్తూరు, మేజర్ న్యూస్ : లోక్ అదాలత్ లో కేసులు రాజీ అయితే ఇరువర్గాలకు సమ న్యాయం జరుగుతుందని ,దీనితో డబ్బు
అదా అవుతుందని,సమయం వృధా కాకుండా ఉంటుందని జడ్జి రాణి అన్నారు.రాష్ట్ర,జిల్లా న్యాయ సేవ సేవల సహకారాధి సంస్థల సంస్థల వారి ఆదేశాలు మేరకు కోర్టు ఆవరణలో అదాలత్ నిర్వహించారు.ఈ నేపథ్యం లో స్పెషల్ లోక్ అదాలత్ (నెగోషియబుల్ ఇనుష్ట్రుమెంట్ యాక్ట్ 1881) యన్ ఐ యాక్ట్ సెక్షన్ 138 (చెక్ బౌన్స్కేసులు )కేసులను రాజీ చేశారు. ఈ పరిష్కారం లో 18లక్షల 80 వేల రూపాయలు నగదు పరిష్కరించినట్లు జడ్జి వెల్లడించారు. ఈలోక్ అదాలత్
లో ఇరువర్గాల వారికి సమన్యాయం జరిగిందని అన్నారు.లోక్ అదాలత్ ను కాక్షిదారులు వినియోగించు కోవాలని జడ్జి కందికట్ల రాణి అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక లోక్ అదాలత్ సభ్యులు యల్ శ్రీరామదూతం,బార్ ప్రసిడెంట్ సి హెచ్ రవికిరణ్ ,ఎజిపి యం అప్పారావు, ఆర్ ఉమామహేశ్వరరావు,ఎ ధర్మారావు ,ఆర్ రాజు ,జియస్ కే ప్రసాద్ ,సి ప్రసాద్ ,తదితర న్యాయవాదులు,కాక్షిదారులు పాల్గొన్నారు.