BREAKING
మెడికోల సమస్య పరిష్కారానికి కేటీఆర్ చొరవ అద్దంకి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవిపై సర్దుబాటు. తొలి రెండేళ్లు సాంబశివరావు, తర్వాత మూడేళ్లు మానస. రాయల్ కింగ్స్ క్రికెట్ జట్టుకు అక్షర యాజమాన్యం జెర్సీల ప్రధానం. కూటమి ప్రభుత్వ అభ్యర్ధులను చిత్తుగా ఓడించండి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారం అందజేత బోధన శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసోత్సవాలు కార్తీక మాసంలో పోచంపాడ్ ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు నూతన చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ* ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ అదాలత్ లో రాజీ ఐతే ఇరు వర్గాలకు సమ న్యాయం --జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి. టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కీలకం పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

నూతన చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ*

Select Suryaa Now
నూతన చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ*
 సూర్య,భీమ్‌గల్, భీమ్‌గల్ పట్టణంలోని 8వ వార్డులో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ సుమారు 25 మంది లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు.వార్డు కౌన్సిలర్ మామరి సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ డి.గజానంద్, చైర్‌పర్సన్ బోదిరే.నాగమణి (స్వామి,) వైస్ చైర్‌పర్సన్ సంటిలత (నర్సయ్య) ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మామరి సందీప్ మాట్లాడుతూ,ప్రజా ప్రభుత్వంలో కొత్తగా చేయూత పెన్షన్ మంజూరు కావడంతో లబ్ధిదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడం సంతోషకరమని పేర్కొన్నారు.