telangana
క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
సూర్య,భీమ్‌గల్ ;భీమ్‌గల్ పట్టణంలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ మండల అర్బన్ అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై విజేతలకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, జట్టుస్ఫూర్తి పెంపొందుతాయని అన్నారు. విద్యార్థులు ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఎక్కువ సమయం క్రీడా మైదానాల్లో గడపాలని సూచించారు. ఓటమి ఎదురైనా నిరాశ చెందకుండా మరింత కష్టపడి విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
క్రీడలకు పెద్దపీట వేస్తూ పోటీల నిర్వహణకు సహకరించిన కృషి పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ పోటీల్లో వాలీబాల్ బాలురు, బాలికలు, జూనియర్ బాలురు, బాలికలు, సబ్ జూనియర్ బాలురు, బాలికల విభాగాల్లో కృషి హైస్కూల్ జట్లు ప్రథమ బహుమతులు సాధించి ప్రతిభ చాటాయి. విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని అభినందిస్తూ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడటమే కాకుండా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరేందుకు పునాదిగా నిలుస్తాయని కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి కౌన్సిలర్లు నరసయ్య ప్రసాద్ రవి మాజీ జెడ్పిటిసి రవి పేట జిల్లా మాజీ అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి పీడీలు రమణ, శ్యామ్,పలు పాఠశాలల పిటిలు తదితరులు పాల్గొన్నారు.