యువత స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి
సూర్య- బిక్కనూర్ యువత స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పట్టణ సర్పంచ్ రేఖ సుదర్శన్ చెప్పారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన యువకుడు అవధూత నవీన్ ఏర్పాటుచేసిన ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ను సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూడకుండా తమకు నచ్చిన రంగంలో రాణించాలని, తద్వారా మరో 10 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుంపల మోహన్ రెడ్డి, అంతంపల్లి సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు