ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి గ్రంథాలయ సంస్థ చైర్మన్
సూర్య- బిక్కనూర్ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం మండలంలోని లక్ష్మీదేవినిపల్లి గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసి, ఇంటి నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ లింగారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గుడిసెలు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి పార్టీ నాయకులు లబ్ధిదారులు ఉన్నారు