telangana
ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ
సూర్య రెంజల్ : శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ ఆలయ ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా బోనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆదివారం మండల కేంద్రంలో గ్రామ దేవత అయినటువంటి శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి ఉదయం నుండి అభిషేకాలు, పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వేద పండితుల మంత్రోచ్ఛరణల ద్వారా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి బోనాల పండుగను పురస్కరించుకొని బోనాలను తీసి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ఏటలను బలి చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతి లలిిత బుజ్జి, గ్రామంలోని వివిధ కులాల పెద్ద మనుషులు, ముత్యాలమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు, సభ్యులు, దంపతులు, మహిళలు భక్తులు పాల్గొన్నారు.